newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రామమందిరానికి అమిత్ షా డెడ్ లైన్

17-12-201917-12-2019 08:06:32 IST
Updated On 17-12-2019 14:56:18 ISTUpdated On 17-12-20192019-12-17T02:36:32.028Z17-12-2019 2019-12-17T02:28:29.234Z - 2019-12-17T09:26:18.954Z - 17-12-2019

రామమందిరానికి అమిత్ షా  డెడ్ లైన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్దాల నాటి బాబ్రీ మసీద్-రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు పుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు రామమందిరం నిర్మాణానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం అంశంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన తాజా ప్రకటన హిందూత్వ వాదులను సంతోష పరుస్తోంది. 

నాలుగు నెలల్లో అయోధ్యలో రామమందిరం కడతామని ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు. జార్ఖండ్‌ పాకూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా  అమిత్ షా సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమయినది. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక, నాలుగు నెలల్లో ఆకాశాన్ని తాకే రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తాం’ అని షా పేర్కొన్నారు.

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూవివాదంలో సుప్రీంకోర్టులో దాఖలైన చరిత్రాత్మక తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.

రివ్యూ పిటిషన్లన్నింటినీ పరిశీలించిన తర్వాత వీటిని కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. దీంతో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

వచ్చే ఏడాది మే నెల నాటికి రాముడి ఆలయం నిర్మాణం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు ఆర్ఎస్ఎస్ కూడా మందిర నిర్మాణానికి అవసరమయిన ఇటుకలు ఇప్పటికే రెడీ అవుతున్నాయి. ప్రతి ఇటుక మీద జై శ్రీరాం అని రాస్తున్నారు. ఆలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని హిందూ సంఘాలు ప్రకటించాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle