newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రామమందిరంపై చెత్త మాట్లాడొద్దు అని మండిపడ్డ మోదీ..!

20-09-201920-09-2019 13:59:14 IST
Updated On 20-09-2019 14:29:48 ISTUpdated On 20-09-20192019-09-20T08:29:14.853Z20-09-2019 2019-09-20T08:29:10.606Z - 2019-09-20T08:59:48.664Z - 20-09-2019

రామమందిరంపై చెత్త మాట్లాడొద్దు అని మండిపడ్డ మోదీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అయోధ్యలోని రామమందిరంపై రోజుకో ప్రకటన చేస్తూ వివాదాలు రేపుతున్న వారు సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని విశ్వసించలేరా అని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. వివాదాస్పదమైన అయోధ్య రామమందిరంపై విచారణ సుప్రీంకోర్టులో తుదిదశలో ఉన్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం పట్ల కాస్త విశ్వాసం ఉంచలేమా అంటూ మోదీ ప్రశ్నించారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తున్న మహాజనదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి నాసిక్ చేరుకున్న ప్రధాని రామమందిరంపై అర్థరహిత వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్న వారిని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా రామ్ జన్మభూమి, బాబ్రి మసీద్ భూ యాజమాన్య వివాదంపై సాగుతున్న న్యాయవిచారణ సుప్రీంకోర్టులో తుదిదశకు చేరుకున్న విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వివాదంపై తుది విచారణ చేపట్టి నవంబర్ చివరిలోగా తన తీర్పు చెప్పనుంది. ఇరుపక్షాల తుది వాదనలు అక్టోబర్‌ 18 నాటికి ముగుస్తాయని గోగోయ్ సూచించారు. తాను రిటైర్ కానున్న నవంబర్ 17కి ముందే ఈ వివాదంపై తీర్పు ఇవ్వచ్చని చీఫ్ జస్టిస్ సూచించారు. 

ఈ సందర్భంగానే మోదీ ఈ వివాదంపై అవాకులూ చవాకులూ పేలుతున్న వారిపై ధ్వజమెత్తారు. గత 2-3 వారాలుగా రామమందిరంపై కొంతమంది నానా చెత్తా వాగుతున్నారు. మనం ఈ విషయంలో సుప్రీంకోర్టును గౌరివంచాలి. ఈ అంశం కోర్టుపరిధిలో ఉంది, అన్ని పక్షాలూ తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విచారణ ప్రక్రియను అడ్డుకునేలా అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్న ఈ వాగుడుకాయలు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రధాని ప్రశ్నించారు. మనం సుప్రీంకోర్టును, రాజ్యాంగాన్ని, భారత న్యాయవ్యవస్థను గౌరవించాలి. భారత న్యాయవ్యవస్థను వీరు గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను అని మోదీ ముక్తాయించారు. 

ఇలా రామమందిరంపై వాగుతున్న వారు ఎవరిని మోదీ బయటపెట్టలేదు. కానీ కాశ్మీర్ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించిన కేంద్రప్రభుత్వం కోర్టు తీర్పుకు ముందే రామమందిరం విషయం పై నిర్ణయం తీసుకోవాలని శివసేన చీప్ ఉద్దవ్ థాకరే రెండురోజుల ముందు చేసిన ప్రకటనను ఉద్దేశించే మోదీ ఇలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle