రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్
18-02-202018-02-2020 08:12:56 IST
2020-02-18T02:42:56.050Z18-02-2020 2020-02-18T02:41:44.750Z - - 11-04-2021

రాబోయే రాజ్యసభ ఎన్నికలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కి కీలకం కానున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రానున్న కాలంలో రాజ్యసభలో విపక్షాల బలం మరింత తగ్గనుంది ఈ ఏడాదిలో వేర్వేరు సమయాల్లో పదవీ కాలం పూర్తవనున్న సీట్లకు తమ పార్టీ అభ్యర్థులను పంపడం ద్వారా ఎన్డీయే బలం పెంచుకొనే యోచనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బలం కూడా సభలో బాగా తగ్గనుంది. అయితే, ఈ సారి పదవీ కాలం పూర్తయ్యే కాంగ్రెస్ సభ్యుల స్థానంలో భర్తీ చేయబోయేవారి జాబితాలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు కూడా వినిపిస్తోంది.రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది మొత్తం 68 సీట్లు ఖాళీ అవుతాయి. ఇవన్నీ ఒకేసారి ఖాళీ కాకుండా ఏప్రిల్‌లో 51, జూన్‌లో 5, జులైలో 1, నవంబర్‌లో 11 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఇందులో 19 సీట్లు కాంగ్రెస్ పార్టీ కోల్పోనుంది. సంఖ్యాబలాన్ని బట్టి అందులో ఆ పార్టీ సొంతంగా తిరిగి మిత్రపక్షాల సహకారంతో ఓ పది స్థానాలు గెలిపించుకోగల సామర్థ్యం మాత్రమే కనిపిస్తోంది. రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను పక్కనబెట్టి...కొత్త రక్తాన్ని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానానికి ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే సోనియా గాంధీ కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి తిరిగి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోనుంది. ఇదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేఘాలయ, అసోం రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉన్న రాజ్యసభ స్థానాలను కోల్పోనుంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ లేదా జూన్‌లో ముగుస్తుంది. వీరిలో కొందరికి మళ్లీ అవకాశం దక్కనుండగా, ఈసారి ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, రణ్‌దీప్ వంటి నేతలను ఎగువ సభకు పంపే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఆ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకోగలదు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82గా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది పడుతోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. బలంగా వాణిని వినిపించే నేతలను బీజేపీ ఎంపిక చేయనుంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా