రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఆకస్మిక మృతి
01-08-202001-08-2020 17:23:27 IST
Updated On 01-08-2020 18:38:35 ISTUpdated On 01-08-20202020-08-01T11:53:27.269Z01-08-2020 2020-08-01T11:53:24.216Z - 2020-08-01T13:08:35.972Z - 01-08-2020

సమాజ్ వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త అమర్ సింగ్ సింగపూర్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు బాగా దెబ్బతినడంతో ఆరు నెలుగా సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స కూడా చేయించుకున్నారు. కొన్ని రోజులు ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డా... ఆతర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు. ఆయన వయసు 64 ఏళ్ళు. అమర్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ రాజకీయాల్లో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ములాయం పార్టీ వ్యవహారాలను చక్కబెడితే... అమర్ సింగ్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అంతేకాకుండా పార్టీలోకి సినిమా తారలను కూడా తీసుకొచ్చి... పార్టీకి మరింత ఆకర్షణను చేకూర్చారు. ఏపీలో వున్న సినీనటి జయప్రదను పార్టీలోకి తీసుకొచ్చింది అమర్ సింగే. అమర్ సింగ్‌ను ఫిబ్రవరి 2, 2010 లో ములాయం సింగ్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. సోనియా ప్రధాని పదవికి రేసులో ఉండగా.... అంతర్గతంగా ఈయన తీవ్రంగా వ్యతిరేకించేవారని రాజకీయ వర్గాలు చెబుతుండేవి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉండేవి. అమర్ సింగ్ అంటే కాంగ్రెస్ నేతలు గౌరవించేవారు. సమాజ్ వాదీ బహిష్కరించడంతో ఆయన 2011 లో రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో అన్ని స్థానాల నుంచీ అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2014 లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరారు. చివరికి 2016 లో అదే సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుుతున్నారు. అమర్ సింగ్ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా