newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

రాజ్యసభలో నీటి ఎద్దడిపై చర్చ.. వెక్కిరించిన కుర్చీలు

01-07-201901-07-2019 16:29:07 IST
2019-07-01T10:59:07.385Z01-07-2019 2019-07-01T10:59:04.145Z - - 16-11-2019

రాజ్యసభలో నీటి ఎద్దడిపై చర్చ.. వెక్కిరించిన కుర్చీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్దల సభ రాజ్యసభలో చర్చలు కూడా పెద్దరికంగానే ఉంటాయని భావించేవారికి ఈ ఫోటో ఉదాహరణ.నిముషానికి విలువైన ప్రజాధనం కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తూ, పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేస్తే సభ్యుల హాజరు మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. దేశంలో నీటిఎద్దడి ఎంత తీవ్రమయిన సమస్యో చెప్పాల్సిన పనిలేదు. చెన్నై వంటి మహానగరంలో నీరు దొరక్క జనం ఎన్నో అవస్థలు పడుతున్నారు. 

చెన్నైలో బంగారమే చవకగా లభిస్తోంది. ఎంతో ఇష్టంగా తినే సాంబారు ఇడ్లీ కూడా వారికి దూరమయింది. బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కొరతతో చెన్నైలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలో రాజ్యసభలో నీటి సమస్యపై చర్చించారు. దేశంలో నీటి ఎద్దడిపై చర్చ ప్రారంభించినప్పుడు రాజ్యసభలో సభ్యుల హాజరు శాతం చూస్తే ఆవేదన చెందక మానరు. ఇంత క్లిష్టమయిన సమస్యను సభ్యులు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదని సోషల్ మీడియాలో విమర్శలు పడుతున్నాయి.

ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ చేపట్టాలని కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ సభలో పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో జల సంక్షోభంపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అనేక అంశాలు ప్రస్తావించారు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. నీటి సంరక్షణకు, భూగర్భ జలాలు తోడెయ్యకుండా కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా దేశంలో నీటి ఎద్దడిపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జలసంరక్షణకు చేపట్టాల్సిన పలు చర్యలను సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చర్చలో సభ్యులు తక్కువగా హాజరుకావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసమస్యలకు సంబంధించిన అంశాల్లో సభ్యుల ఉదాశీన వైఖరికి ఈ ఫోటో నిదర్శమని దెప్పిపొడుస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle