రాజీనామాలు.. బుజ్జగింపులు..ఎదురుచూపులు
15-07-201915-07-2019 08:00:05 IST
Updated On 15-07-2019 11:45:03 ISTUpdated On 15-07-20192019-07-15T02:30:05.924Z15-07-2019 2019-07-15T02:28:53.719Z - 2019-07-15T06:15:03.022Z - 15-07-2019

కర్నాటక రాజకీయం రంగులు మారుతోంది. అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పోరాటం చేస్తుంటే.. అధికారం ఎలాగైనా చేజిక్కుంచుకునేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. ఓ వైపు కొనసాగుతున్న బుజ్జగింపు ప్రయత్నాలు.. మరోవైపు భారతీయ జనతా పార్టీవైపు వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ నేతల మధ్య కీలక భేటీ ప్రాధాన్యత పెరిగింది.

కుమారకృప అతిథి గృహంలో జరిగిన ఈ భేటీకి జేడీఎస్ నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం సిద్ధ రామయ్య, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, దినేశ్ గుండూరావు తదితరులు హాజరయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదురైతే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు. విశ్వాసపరీక్ష పెట్టాలని బీజేపీ వత్తిడి తెస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగుతున్నాయి.
చర్చల అనంతరం మెత్తబడిన ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు యూటర్న్ తీసుకుని అసంతృప్త ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లడంతో వారి ప్రయత్నాలు మళ్లీ మొదటి కొచ్చాయి. 15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, కుమారస్వామి ప్రభుత్వం నడపడంపై యడ్యూరప్ప మండిపడుతున్నారు.
కుమారస్వామి తక్షణమే రాజీనామా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుజ్జగించిన ఎమ్మెల్యేలను దారితెచ్చుకోవడంతో పాటు విశ్వాస పరీక్షను ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్-జేడీఎస్ నేతలు తలమునకలయ్యారు. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర క్యాంపులో వున్న అసంతృప్త ఎమ్మెల్యేలు గుళ్ళూగోపురాలు తిరుగుతున్నారు.


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
20 hours ago
ఇంకా