newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

రాజకీయ వైరాగ్యం ప్రదర్శించినా సానుభూతి దక్కని కుమారస్వామి

05-08-201905-08-2019 10:36:11 IST
2019-08-05T05:06:11.090Z05-08-2019 2019-08-05T05:06:08.758Z - - 22-11-2019

రాజకీయ వైరాగ్యం ప్రదర్శించినా సానుభూతి దక్కని కుమారస్వామి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కర్నాటక ముఖ్యమంత్రికి హఠాత్తుగా రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది. అనుకోకుండా సీఎంను అయ్యాను, ఇక రాజకీయాల నుంచి వైదొలగుదామనుకుంటున్నానంటూ వేదాంతం మాట్లాడారు. అయితే 14 నెలల కర్నాటకం చూసిన తరువాత జనానికి   నైరాశ్యంతో మాట్లాడినా ఇసుమంతైనా సానుభూతి కలిగిన దాఖలాలు లేవు. వైరాగ్యంతో రాజకీయ సన్యాసం గురించి మాట్లాడిన మరుసటి రోజే ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ...పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చి తన చంచలత్వాన్ని, స్థిరత్వ లేమినీ మరోసారి ప్రదర్శించారు. అసలు కర్నాటక రాజకీయాలంటేనే అస్థిరతకు చిరునామాగా మారిపోయినప్పుడు...అక్కడి రాజకీయ నాటకంపై జనానికి ఎటువంటి ఆసక్తీ మిగిలే అవకాశం లేదు. 

కర్నాటకలో ఏం జరిగినా ఎవరూ ఆశ్చర్యపోరు. జనంతో సంబంధం లేని, జనానికి పట్టని రసవత్తర నాటకం కర్నాటకలో నిరవధికంగా సాగుతోంది. విశ్వాస పరీక్షలో విఫలమై కుమారస్వామి సీఎం పదవి నుంచి దిగిపోయారు. బలపరీక్షలో గెలిచి యడియూరప్ప సీఎం పదవిని అధిష్టించారు. ఈ రెండూ జరగకపోయినా క‘ర్నాటకం‘ ఎవరికీ పట్టని పరిస్థితికి ఎప్పుడో చేరుకుంది.   ఒక వేళ విశ్వాస పరీక్షలో విజయం సాధించి కుమారస్వామి సీఎంగా కొనసాగినా కూడా ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోయి ఉండరు. అలాగే యడియూరప్ప సభలో బలపరీక్షలో ఓడిపోయినా కూడా ఎవరూ స్పందించే పరిస్థితి లేదు. అంతగా భష్టుపట్టిపోయాయి కర్నాటక రాజకీయాలు. ఇప్పుడు యడియూరప్ప ముఖ్యమంత్రిగా కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరినా అది ఎంత కాలం మనగలుగుతుందన్నది సందేహమే. ఈ సందేహం వ్యక్తం చేస్తున్నది రాజకీయ పరిశీలకులో, విశ్లేషకులో కాదు సామాన్య జనం. దక్షిణాదిలో పాగా వేయాలంటే కర్నాటకే గేట్ వే అని బీజేపీ ఎలా నమ్ముతోందో...దక్షిణాదిలో బీజేపీని అడ్డుకుంటే ఇప్పుడు కాకపోతే రేపైనా దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభకు గండి కొట్టవచ్చని బీజేపీయేతర పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కర్నాటక అసెంబ్లీకి 14నెలల కిందట జరిగిన ఎన్నికలలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా...ఆ పార్టీకి అధికారం అందని ద్రాక్షను చేసి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టి మరీ ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు వచ్చిన జేడీఎస్ కు మద్దతుగా నిలిచాయి. అందుకే కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. 

సభలో కేవలం కాంగ్రెస్ బలంతో అధికారాన్ని చేజిక్కించుకున్న కుమారస్వామికి సీఎంగా పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా మారిందని చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారడానికి కారణమే జేడీఎస్ అధినేత దేవెగౌడతో విభేదాలు. అటువంటి వ్యక్తి...తన నేతృత్వంలో కాంగ్రెస్ అధిక స్థానాలను దక్కించుకుని కూడా తమ పార్టీ కంటే తక్కువ స్థానాలు ఉన్న జేడీఎస్ కు మద్దతు ఇచ్చి సెకెండ్ ఫెడల్ గా వ్యవహరించాల్సి రావడం, అదీ తనకు రాజకీయ శత్రువైన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం ఆయన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ స్థానాలున్న పార్టీ పక్ష నేతగా పని చేయాల్సి రావడం సహజంగానే సిద్దరామయ్యకు, ఆయన వర్గం ఎమ్మెల్యేలకూ రుచించలేదు. అసలు కర్నాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంలోనే ఒక వైచిత్రి ఉంది. సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీ ఆ కూటమికి, ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుది. కానీ అందుకు భిన్నంగా కర్నాటకలో ఎక్కువ స్థానాలున్న కాంగ్రెస్ కాకుండా తక్కువ స్థానాలలో గెలుపొందిన జేడీఎస్ నాయకత్వం వహించింది. ఆ కూటమి ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించింది అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీయే. అందుకే ఇంత అసహజంగా కొలువుదీరిన కూటమి ఎక్కువ కాలం అధికారంలో మనగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు అదే జరిగింది. అయినా ఇంత తొరగా కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి  సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఘోర పరాజయమే కారణం. అలాగే 14 నెలల కిందట  సహజత్వానికి భిన్నంగా జేడీఎస్ నేతృత్వంలో కూటమి సర్కార్ కొలువుదీరడానికి అప్పటికి ఉన్న రాజకీయ అనివార్యత... అంటే  దగ్గరలో సార్వత్రిక ఎన్నికలు జగరనుండటమే కారణం.

 కర్నాటకలో బీజేపీని అధికారానికి దూరం చేయగలిగితే...ఆ ఉత్సాహం, ఊపుతో సార్వత్రిక ఎన్నికలలో కూడా కూటమి రాజకీయాలకు అవకాశం ఉంటుందని అప్పట్లో బీజేపీయేతర పార్టీలన్నీ భావించడంతో కాంగ్రెస్ ఒక మెట్టు దిగి   జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చింది.   సాధారణంగా కాంగ్రెస్ తగ్గి సంకీర్ణ ప్రభుత్వానికి సహకారం అందించిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీ అదును చూసి వేటు వేస్తుందన్నది జగద్విదితం. ఇందుకు గతంలో కూడా పలు ఉదాహరణలున్నాయి. చంద్రశేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హఠాత్తుగా బయట నుంచి మద్దతు ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంతెందుకు గతంలో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సర్కార్ కు కాంగ్రెస్ బయట నుంచి ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవడం వల్లే నాడు ఆయన సర్కార్ పతనమైంది. అందుకే కొలువుదీరిన నాడే కుమారస్వామి ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటేనని పరిశీలకులు ఘంటాపథంగా చేప్పేశారు. చివరకు అదే జరిగింది. ఇప్పుడు ఈ పరిణామాల పట్ల మాజీ సీఎం హోదాలో కుమార స్వామి ఎంత నిర్వేదం ప్రదర్శించినా, వైరాగ్యం ప్రకటించినా ప్రజా సానుభూతి ఉంటుందనుకోవడం అత్యాసే అవుతుంది


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle