newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

రసకందాయంలో ‘మహా’రాజకీయం

05-06-201905-06-2019 09:16:16 IST
Updated On 24-06-2019 16:20:54 ISTUpdated On 24-06-20192019-06-05T03:46:16.573Z05-06-2019 2019-06-05T03:46:09.013Z - 2019-06-24T10:50:54.597Z - 24-06-2019

రసకందాయంలో ‘మహా’రాజకీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు మ‌హా రంజుగా మారుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే శివ‌సేన‌, బీజేపీ కూట‌మి అన్ని స‌మ‌స్య‌ల‌ను క్లియ‌ర్ చేసుకుంది. మొత్తం 288 సీట్లున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 135, శివ‌స‌నే 135 సీట్ల‌లో పోటీకి దాదాపు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిగిలిన 18 సీట్లు త‌మ కూట‌మిలో ఉన్న చిన్న పార్టీల‌కు కేటాయించ‌నున్నాయి. 

ఈసారి కూడా తమ‌ ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ పేరు ఖ‌రారు చేసిన‌ బీజేపీకి శివ‌సేన ఓకే చెప్పింది. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మొత్తం 48 సీట్ల‌లో 25 చోట్ల పోటీ చేసిన బీజేపీ 23 సీట్లు గెలిస్తే, 23 చోట్ల పోటీ చేసిన శివ‌సేన 18 చోట్ల గెలిచింది.

ఇదంతా అధికార పార్టీ రాజ‌కీయం అయితే, ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు పొస‌గ‌డం లేదు. మొన్న‌టి పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, స్థానికంగా నేత‌ల మ‌ధ్య లుక‌లుక‌లు ఈ రెండు పార్టీల‌కూ ఇబ్బందిగా మారుతున్నాయి.

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్, ఎన్సీపీల‌కు చెందిన కీల‌క నేత‌లు, బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత రాధాకృష్ణ వికె పాటిల్ బీజేపీలో చేరుతున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న త‌న ఎంఎల్ఏ ప‌ద‌వికి రాజీనామా చేశారు. అలాగే ఎన్సీపీ సీనియ‌ర్ నేత విజ‌య‌సింహ్ మొహితే పాటిల్ కూడా బీజేపీలో చేరుతున్నారు. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అహ్మ‌ద్ న‌గ‌ర్ సీటు కావాల‌ని వికె పాటిల్ కుమారుడు సుజ‌య్ వికె పాటిల్ కోరారు. అయితే సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ నేత త‌న సీటును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. 

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సుజ‌య్ పాటిల్ విన్న‌పాన్ని తోసిపుచ్చింది. దీంతో ఆయ‌న బీజేపీలో చేరారు. అహ్మ‌ద్ న‌గ‌ర్ ఎంపీ సీటు నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి 2,81,526 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఆయ‌న తండ్రి రాధ‌కృష్ణ వికె పాటిల్ కూడా బీజేపీలో చేరుతున్నారు.

ఇక మాధ ఎంపీ సీటులో సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్సీపీ నేత విజ‌య‌సింహ్ మొహితే పాటిల్ మీద శ‌ర‌ద్ ప‌వార్ ప‌లు సంద‌ర్భాల్లో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అందుకు నేరుగా ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని శ‌ర‌ద్ ప‌వార్, మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తాను మాధ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తాన‌ని మొద‌ట ప్ర‌క‌టించారు. 

ఆ త‌ర్వాత తాను పోటీకి సిద్ధంగా లేనంటూ మ‌రోవ్య‌క్తికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో జ‌రిగిన మోసాన్ని గ్ర‌హించిన విజ‌య‌సింహ్ కుమారుడు రంజిత్ సింహ్ పాటిల్ బీజేపీలో చేరి, మాధ ఎంపీ సీటు ఆ పార్టీకి అప్ప‌గించారు. ఇప్పుడు ఆయ‌న తండ్రి విజ‌య్ సింహ్ పాటిల్ కూడా బీజేపీలో చేరుతున్నారు. ప్ర‌స్తుతానికి వీరిద్ద‌రి పేర్లు బ‌హిరంగంగా వినిపిస్తున్నా, చాలా మంది కాంగ్రెస్, ఎన్సీపీ నేత‌లు బీజేపీ, శివ‌సేన‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle