newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రష్యాను అధిగమించి పైపైకి.. మూడోస్థానంలో ఇండియా

06-07-202006-07-2020 18:31:03 IST
2020-07-06T13:01:03.800Z06-07-2020 2020-07-06T13:00:44.687Z - - 22-04-2021

రష్యాను అధిగమించి పైపైకి.. మూడోస్థానంలో ఇండియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. కరోనా కేసుల విషయంలో భారతదేశం రష్యాను అధిగమించి, టాప్-3 స్థానంలోకి చేరుకుంది. దేశంలో అధికారికంగా 6.9 లక్షల కేసులు రాగా, రష్యాలో నమోదైన 6.8 లక్షల కేసులను ఇండియా దాటేసింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు 28 లక్షలకు పైగా కేసులతో అమెరికా, 15 లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ ఉన్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తరువాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 

ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత రెండవ దఫా అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని  పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాప్తిపై సిఫార్సులను సవరించాలని పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య కేంద్రాన్ని  కోరారు. 

తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు. కొవిడ్‌-19 , వైరస్‌ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే  చెప్పింది. గాలి ద్వారా ఆ వైరస్‌‌ వ్యాప్తి చెందుతుందన్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయలేదు. ఈ పరిశోధనల వివరాలను పరిశోధకులు వెల్లడించనున్నారు.

భారత్‌లో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాని ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా  మారిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. తమిళనాడులో 4,200కు పైగా, ఢిల్లీలో 2,500కు పైగా కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌ బలంగా పంజా విసురుతుం డటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర లో కొవిడ్‌ కేసులు రెండు లక్షలు దాటేశాయి. అక్కడ ఒక్కరోజులో 7074 కేసులు రికార్డయ్యాయి. తమిళనా డులో 4,280 కేసులు, తెలంగాణ, కర్నాటక, అసోం, బీహార్‌ రాష్ట్రాలలో 7,935 కేసులు వెలుగులోకి వచ్చాయి.

దేశంలోని మొత్తం కేసులో 78శాతం ఏడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.  ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పెరుగుదల రేటు జాతీయ రేటు కంటే అధికంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల కారణంగా తొలిసారి కేసుల లోడ్‌ ఏకంగా 25 శాతానికిపైగా పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జూన్‌ ప్రారంభంలో పెరుగుదల రేటు 17.5 శాతం ఉండగా ప్రస్తుతం అది 25 శాతానికి పెరిగిందంటే పరిస్థితి తీవ్రత ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   12 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle