newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

రబ్రీదేవికి కోపమొచ్చింది.. పిల్లలకు స్వీట్ వార్నింగ్

03-06-201903-06-2019 19:02:59 IST
Updated On 24-06-2019 17:08:34 ISTUpdated On 24-06-20192019-06-03T13:32:59.919Z03-06-2019 2019-06-03T13:32:57.647Z - 2019-06-24T11:38:34.363Z - 24-06-2019

రబ్రీదేవికి కోపమొచ్చింది.. పిల్లలకు స్వీట్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి పార్లమెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధినేత‌, లాలూ ప్రసాద్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవికి దిమ్మతిరిగింద‌ట‌. మొత్తం 40 సీట్లున్న బీహార్ రాష్ట్రంలో లాలూ పార్టీ ఒక్క సీటులో కూడా గెల‌వ‌లేదు. 39 సీట్లు బీజేపీ, జేడీయూ కూట‌మి గెల్చుకుంటే, కేవ‌లం కిష‌న్ గంజ్ సీటులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో గ‌త వైభ‌వాన్ని తల్చుకుని ర‌బ్రీదేవి తెగ బాధ ప‌డిపోతున్నార‌ట‌. ఓవైపు త‌న భ‌ర్త లాలూ యాద‌వ్ దాణా కుంభ‌కోణంలో జైల్లో ఉండ‌టం, మ‌రోవైపు త‌న కుమారుల మ‌ధ్య గొడ‌వ‌తో పార్టీ రెండుగా చీల‌డాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నట్లు జాతీయ మీడియా క‌థ‌నాలు ప్రసారం చేస్తోంది. 

లాలూ జైలుకు వెళ్లిన త‌ర్వాత పార్టీ మీద ఆధిప‌త్యం కోసం త‌న ఇద్దరు కుమారులు తేజ‌శ్వి యాద‌వ్, తేజ్ ప్రతాప్ యాద‌వ్ పోటీ ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో వీరిద్దరిలో ఒక‌రిని త‌న‌వైపు తిప్పుకున్న లాలూ కుమార్తె మీసా భార‌తి త‌న‌వంతు రాజ‌కీయం న‌డిపారు. ఈ ముగ్గురి మ‌ధ్య జ‌రిగిన వ‌ర్గపోరులో లాలూ యాద‌వ్ క‌ష్టం మీద ఏర్పాటైన రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ పార్టీ నాశ‌నం అవుతోంద‌న్న ర‌బ్రీదేవికి భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో పార్టీ ప‌గ్గాలు తానే తీసుకోవాల‌ని నిర్ణయించుకున్న ర‌బ్రీదేవి, గ‌తంలో త‌న కుమారుల‌కు పార్టీ ప‌రంగా ఇచ్చిన అధికారాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నార‌ట‌. 

అంతేకాదు, కుమార్తె మీసా భార‌తికి కూడా గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చార‌ట ర‌బ్రీదేవి. పార్టీలో ఎంత వ‌ర‌కు ఉండాలో, అంత వ‌ర‌కే ఉండాల‌నీ, అంత‌కు మించి ఓవ‌ర్ యాక్షన్ చేస్తే ఊరుకోనంటూ హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు, మ‌రో ముఖ్యమైన నిర్ణ‌యం తీసుకున్న ర‌బ్రీదేవి, పార్టీ నేత‌ల‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చార‌ట‌. పార్టీ ప‌రంగా తాను ఇస్తున్న ఇఫ్తార్ విందుకు రావాలంటూ ఆర్జేడీ నేత‌లో పాటు ప‌లువురు బీహార్ బీజేపీ నేత‌ల‌కు ర‌బ్రీదేవి ఆహ్వానం పంపార‌ట‌. 

ఆదివారం జ‌రిగిన ఈ విందు బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఆహ్వానించారు ర‌బ్రీదేవి. అయితే ఆహ్వాన ప‌త్రంలో కేవ‌లం త‌న ఫొటో మాత్రమే ముద్రించిన ర‌బ్రీదేవి, త‌న కుమారుల పేర్లు కానీ, ఫొటోలు కానీ ముద్రించ‌లేద‌ట‌. అంతేకాదు, పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా త‌న కుమారుల ఫొటోలు తీసేయాల‌ని ఆదేశించార‌ట ఆమె. ర‌బ్రీదేవి ఇంత‌గా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోడానికి చాలా కార‌ణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

పార్టీలో లాలూ యాద‌వ్ లేని లోటు తీర్చాలంటూ చాలా మంది కార్యక‌ర్తలు ర‌బ్రీదేవిని కోరార‌ట‌. గ‌తంలో ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాల‌నీ చెప్పిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అప్పట్లోగా ఆర్జేడీ గ‌త వైభ‌వం తెచ్చుకోక‌పోతే, చాలా ఇబ్బందులు ప‌డాల‌న్న అనుమానంతో ముందు జాగ్రత్తగా అటు నితీష్ పార్టీకీ, ఇటు బీజేపీకి గాలం వేస్తున్నారు ర‌బ్రీదేవి. ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే, అన్ని గండాల నుంచీ గ‌ట్టెక్కవచ్చన్న లాలూ యాద‌వ్ ఆలోచ‌న‌ను, ర‌బ్రీదేవి అమ‌లు ప‌రుస్తున్నార‌ని చాలా మంది భావిస్తున్నారు. 

అయితే జేడీయూ, బీజేపీ స్నేహ‌బంధం చెదిరిపోవ‌డం ఇప్పట్లో జ‌రిగే ప‌ని కాద‌ని కూడా విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే కేంద్రంలో తిరుగులేని మెజార్టీ సాధించిన బీజేపీకి, జేడీయూ ఎన్డీయే నుంచి వెళ్లిపోయినా పెద్ద‌గా ఇబ్బంది లేదు. ఇదే స‌మ‌యంలో లాలూ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, కేంద్రంతో అన‌వ‌స‌రంగా క‌య్యం పెట్టుకున్న‌ట్లే. అందుకే నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి ఇప్పట్లో బ‌య‌ట‌కు రార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   10 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle