newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రఫేల్ పై సుప్రీం తీర్పు..ఎవరెవరు ఏమన్నారంటే..?

14-11-201914-11-2019 15:23:09 IST
2019-11-14T09:53:09.040Z14-11-2019 2019-11-14T09:53:07.290Z - - 22-04-2021

రఫేల్ పై సుప్రీం తీర్పు..ఎవరెవరు ఏమన్నారంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్ పిటిషన్లను కొట్టిపారేసింది. రఫెల్ డీల్ పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రఫెల్ డీల్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా ఒప్పందం జరిగిందని సూచించింది. ఈతీర్పుపై బీజేపీ నేతలు, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుపై వారు మండిపడ్డారు. 

సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తంచేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ ఒప్పందం ప్రభుత్వ విధానానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ నిర్ణయంలో పారదర్శకత మరోసారి నిరూపితమయిందన్నారు రాజ్ నాథ్ సింగ్.

కాంగ్రెస్, రాహుల్ గాంధీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా. రఫేల్ డీల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్ని తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. 

సుప్రీంతీర్పుని ప్రధాని నరేంద్రమోడీ అద్భుత విజయంగా అభివర్ణించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సుప్రీం తీర్పుతో రఫేల్ ఒప్పందంపై ఉన్న అపోహలు, ఆరోపణలు తొలగిపోయాయని, రాజకీయ ప్రయోజనాల కంటే సైనికదళాల ప్రయోజనాలు ముఖ్యమని గుర్తించాలన్నారు మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా. 

రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పుపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బలాంటిదని, రాహుల్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని భావిస్తున్నానన్నారు.

‘‘సత్యమే విజయం సాధించింది.. సత్యాన్ని బాధపెట్టవచ్చు గానీ అంతిమంగా దానిని ఓడించలేరు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. తీర్పుపై స్పందించారు బీజేపీ నేత అమిత్ మాలవీయ. 

‘‘రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు అసత్యమని సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయింది. రాఫెల్ పై రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని నాడు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే, నేడు సుప్రీంకోర్టు అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేయడం మోడి ప్రభుత్వ నిబద్ధత నిదర్శనం’’ అన్నారు రాజ్యసభ ఎంపీ వై.సుజనా చౌదరి. 

సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. రాహుల్ గాంధీ ఆరోపణలు దేశ రక్షణ రంగం మనోస్థయిర్యం దెబ్బతీశాయని, సుప్రీం తీర్పుతో రాహుల్ గాంధీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle