newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రజనీకి వలవేసిన బీజేపీ.. వర్కవుట్ అవుతుందా?

19-08-201919-08-2019 09:24:39 IST
Updated On 20-08-2019 11:26:08 ISTUpdated On 20-08-20192019-08-19T03:54:39.927Z19-08-2019 2019-08-19T03:53:33.089Z - 2019-08-20T05:56:08.098Z - 20-08-2019

 రజనీకి వలవేసిన బీజేపీ.. వర్కవుట్ అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దారెటు. ఆయన చూపులు కమలం వైపు వున్నాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నాయి. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కీలక నేతలకు వల వేస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ను తమవైపు తిప్పుకునే పనిలో బిజీగా ఉంది. కర్నాటకలో అధికారం చేజిక్కుంచుకున్న బీజేపీ తమిళనాడునూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. 

ఎప్పటినుంచో రజనీకాంత్‌ సొంతంగా పార్టీ ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే స్వంత పార్టీ కంటే బీజేపీలో చేరితే పార్టీ పగ్గాలు అప్పగించడంతోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆఫర్‌ ఇచ్చినట్టు వార్తలు వెలువడడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.

2023 నాటికి దక్షిణాదిన తెలంగాణలో అధికారంతో పాటు తమిళనాడులోనూ చెప్పుకోదగ్గ సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఏడాదిన్నర క్రితం పార్టీని స్థాపించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ ఆశించిన రీతిలో ఓట్లను రాబట్టుకోలేకపోయింది.

దీంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకొని శాసనసభ ఎన్నికల్లో బలమైన పార్టీగా అవతరించాలని కమల్‌ భావిస్తున్నారు.

కమల్ ఆలోచన అలా ఉంటే ..రజనీకాంత్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన టార్గెట్ శాసనసభ ఎన్నికలేనని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించడంతో త్వరలోనే ఆయన సొంతంగా పార్టీ స్థాపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలను కృష్ణార్జునులతో పోల్చడం హాట్‌టాపిక్‌ అవుతోంది.

రజనీకాంత్‌ బీజేపీకి దగ్గరవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాలలో రజనీ ప్రధాని మోదీ పాలనను అభినందించిన విషయాలను కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

కశ్మీర్‌ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, మోదీ, అమిత్‌షాలను రజనీకాంత్‌ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక రజనీ ఆలోచనను రాజకీయ విశ్లేషకులు ఉటంకిస్తున్నారు. రజనీ ఇమేజ్ బీజేపీకి ప్లస్ అవుతుందేమో చూడాలి. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle