రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి
12-08-202012-08-2020 10:51:28 IST
2020-08-12T05:21:28.105Z12-08-2020 2020-08-12T05:21:17.373Z - - 12-04-2021

సోషల్ మీడియా జనజీవన స్రవంతిలో కీలక భూమిక నిర్వహిస్తోంది. అయితే ఒక్కోసారి కొన్ని సోషల్ మీడియా పోస్టులు రచ్చరేపుతుంటాయి. కర్నాటకలో ఒక్క సోషల్ మీడియా పోస్టు బెంగళూరు నగరంలో గొడవలకు కారణమయింది. ముగ్గురు మరణానికి దోహదం చేసింది. ఈ పోస్టుకి వ్యతిరేకంగా కొందరు పౌరులు అల్లర్లు సృష్టించగా.. వాటిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ అల్లర్లతో బెంగళూరు ఒక్కసారిగా భగ్గుమంది. బెంగళూరు తూర్పు ప్రాంతంలో ఈ అల్లర్లు చెలరేగాయి. రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాంగ్రెస్ శాసన సభ్యుడి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దాడి చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈ సంఘటనపై నగర కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన ఓ పోస్ట్ ఈ అల్లర్లకు దారి తీసిందని ఆయన అన్నారు. అల్లర్లకు కారణమైన దాదాపు 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద చోటుచేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసం పై కొందరు పౌరులు దాడికి పాల్పడ్డారు. వెంటనే ఎమ్మెల్యే ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు అక్కడికి పరుగున వచ్చారు. అయితే.. వారు పోలీసుల పై రాళ్ల దాడి కి పాల్పడ్డారు. వాహనాన్ని తగులబెట్టారు. ఈ నేపధ్యంలో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంతో పాటు బెంగళూరు తూర్పులోని కెజె.హళ్ళి పోలీస్ స్టేషన్‌పై కూడా ఈ అల్లరిమూక దాడి చేసింది. ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టును వ్యతిరేకిస్తూ, వీరు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్, అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామ్. ప్రస్తుతం పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నాయి. స్థానికులు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ పంత్ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
14 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా