newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

రంజాన్ వస్తోంది.. పోలింగ్ టైం మార్చండి

02-05-201902-05-2019 12:14:43 IST
Updated On 02-05-2019 12:18:33 ISTUpdated On 02-05-20192019-05-02T06:44:43.878Z02-05-2019 2019-05-02T06:44:41.601Z - 2019-05-02T06:48:33.929Z - 02-05-2019

రంజాన్ వస్తోంది.. పోలింగ్ టైం మార్చండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ జరిగింది. ఈనెల ఆరవ తేదీన ఐదవ విడత పోలింగ్ జరగనుంది. అయితే మున్ముందు జరగాల్సిన పోలింగ్ సమయాలను మార్చాలంటూ దాఖలైన పిటీషన్‌లను పరిశీలనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంను టైమ్ మార్పుల గురించి కోరనుంది. రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పోలింగ్ సమయాలను ఉదయం 7గంటల నుంచి 5గంటల వరకు కాకుండా మార్చాలంటూ ఎన్నికల సంఘంను సుప్రీంకోర్టు కోరింది. 

ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది. అంతేకాక రాజస్థాన్ మరియు ఇతర ప్రాంతాలలో వేడి గాలులు ఎక్కువయ్యే పరిస్థితుల కారణంగా ఓటింగ్ సమయాన్ని పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను కోరింది. అయితే పోలింగ్ సమయాల్లో మార్పులపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవలసి ఉంది. ఏ సమయం అనుకూలంగా ఉంటుందో పరిశీలించనుంది ఈసీ. తదనంతరం కాస్త వెసులుబాటు కల్పించనుంది.  

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle