newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

య‌డియూర‌ప్ప‌కు ఇక ఫుల్ హ్యాపీ

10-12-201910-12-2019 08:11:01 IST
2019-12-10T02:41:01.676Z10-12-2019 2019-12-10T02:40:53.764Z - - 17-04-2021

య‌డియూర‌ప్ప‌కు ఇక ఫుల్ హ్యాపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఊర‌ట‌నిచ్చాయి. వ‌రుస‌గా ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతున్న ఆ పార్టీకి క‌ర్ణాట‌క‌లో అధికారం సుస్థిర‌మైంది. ద‌క్షిణాధిన కూడా తాము ఉన్నామ‌ని ఈ ఉప ఎన్నికల ద్వారా నిరూపించుకోగ‌లిగింది ఆ పార్టీ. ఇక‌, ఇదే స‌మ‌యంలో క‌న్న‌డ‌నాట మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని స్థాపించాల‌నుకున్న‌ కాంగ్రెస్, జేడీఎస్‌కు ఉప ఎన్నిక‌లు షాక్ ఇచ్చారు.

గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినా మ్యాజిక్ ఫిగ‌ర్ అందుకోలేక‌పోయింది. అయినా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన య‌డియూర‌ప్ప అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా బ‌లం నిరూపించుకోలేక మూడు రోజుల‌కే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆ స‌మ‌యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వెన‌క్కు త‌గ్గింది కానీ క‌ర్ణాట‌క‌లో ఎలాగైనా ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ స్థాపించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.ఎన్నిక‌ల త‌ర్వాత పొత్తు పెట్టుకొని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ - జేడీఎస్ కూట‌మిలోని లుక‌లుక‌లు ఉప‌యోగించుకొని ఆప‌రేష‌న్ క‌మ‌ల నిర్వ‌హించి వారి పార్టీల నుంచి 17 మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించ‌గ‌లిగింది బీజేపీ. దీంతో ఏడాదికే కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ య‌డియూర‌ప్ప గ‌ద్దెనెక్కారు.

17 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. వీరికి చెందిన 15 స్థానాల‌కు జ‌రిగిన ఫ‌లితాలు సోమ‌వారం వెలువ‌డ్డాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటేనే అధికార పీఠం సేఫ్‌గా ఉంటుంది. లేక‌పోతే మ‌ళ్లీ కాంగ్రెస్ - జేడీఎస్ కూట‌మి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇందుకోసం ఆ రెండు పార్టీల మ‌ధ్య ఒక స‌యోధ్య కూడా ఉంది.

దీంతో య‌డియూర‌ప్ప మ‌రోసారి త‌న ప‌ద‌వి పోకుండా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. జాతీయ నాయ‌కులు ఎవ‌రూ రాక‌పోయినా త‌నే బాధ్య‌త‌లు తీసుకొని ప్ర‌చారం నిర్వ‌హించారు. రెబ‌ల్ బెడ‌ద ఉన్నా ఫిరాయించిన నేత‌ల‌కు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోగ‌లిగారు. ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఇక మూడున్న‌రేళ్ల పాటు క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారం సుస్థిరంగా కొన‌సాగ‌నుంది. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నుకున్న కాంగ్రెస్ - జేడీఎస్ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి.

అవ‌త‌లి ప‌క్షం ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్టి అధికారంలోకి వ‌చ్చార‌నే ముద్ర‌ను సైతం య‌డియూర‌ప్ప ఈ ఎన్నిక‌ల‌తో తిప్పికొట్టారు. ప్ర‌జ‌ల్లోనే ఫిరాయించిన వారిని గెలిపించుకొని, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని నిరూపించుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో అధికారాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయాక బీజేపీకి క‌ర్ణాట‌క ప్ర‌తిష్ఠాత్మంగా మారింది. ఇప్పుడు ఫ‌లితాల‌తో ఆ పార్టీకి ఊర‌ట ద‌క్కింది.

ఇక‌, ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు క‌న్న‌డ కాంగ్రెస్‌లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మైంది. ఫ‌లితాల‌కు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ పీసీసీ అధ్య‌క్షుడు దినేశ్ గుండూ రావు, సీఎల్పీ నేత సిద్ధ‌రామ‌య్య త‌మ పద‌వుల‌కు రాజీనామా చేశారు.

అయితే, ఒక‌వేళ తాము ఎక్కువ సీట్లు గెలిచినా మ‌ళ్లీ కుమార‌స్వామికే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఈ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోలేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి య‌డియూర‌ప్ప ప‌ద‌వీకాలాన్ని హాయిగా పూర్తి చేసుకునేందుకు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు అవ‌కాశం ఇచ్చాయి.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   22 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle