newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూపీలో 35 లక్షలమంది కూలీలకు కరోనా సహాయం.. సీఎం యోగి వరం

22-03-202022-03-2020 13:33:23 IST
2020-03-22T08:03:23.093Z22-03-2020 2020-03-22T08:02:31.178Z - - 23-04-2021

యూపీలో 35 లక్షలమంది కూలీలకు కరోనా సహాయం.. సీఎం యోగి వరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో మొట్టమొదటి కరోనా సహాయం యూపీ పేదలకు లభించింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ కరోనా ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, రోజువారి కూలీలపై ప్రభావం పడకుండా ఉండేందుకు వారికి సాయం ప్రకటించింది. దాదాపు 35 లక్షల మంది రోజువారి కూలీలకు నిత్యావసరాల కోసం రూ. 1000 ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చాలా మంది ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వాలు ఆదేశిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వల్ల పేదలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల 15లక్షల మంది రోజువారి కూలీలు, 20.37 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు లబ్ధి పొందనున్నారు. కాగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది కోలుకోగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. 

రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండడంతో దీనికి అడ్డుకట్టవేసేందుకు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని యూపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.  

తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలల మూసివేతను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్‌ అయ్యే అవకాశం కల్పించింది. ఈ మేరకు అడిషనల్‌ చీప్‌ సెక్రటరీ రేణుక కుమార్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే యూపీలో 1.65 కోట్లమందికి ఒక నెల రేషన్‌ని ఉచితంగా అందించాలని యూపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంత్యోదయ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు, రోజు కూలీలకు ఉచిత రేషన్ అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని రోజుకూలీలు రేషన్ కార్డు లేనప్పటికీ ప్రాధాన్యతా ప్రాతిపదికన రేషన్ కార్డులను పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ రెండో దశలో ఉంది. మనం ఈ దశలోనే దాన్ని నిరోధించామంటే ప్రపంచం మొత్తానికి పెద్ద సందేశం పంపించవచ్చునని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ వైరస్ నిరోధానికి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో ఐసోలేషన్ వార్డులను నెలకొల్పాం. కాని ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఎవరికివారు సొంతంగా ఈ సవాలుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తే చాలు అని యోగి చెప్పారు..

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   10 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle