newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

యూపీలో బీజేపీకి హ్యాపీ న్యూస్

16-05-201916-05-2019 12:35:15 IST
Updated On 27-06-2019 17:29:09 ISTUpdated On 27-06-20192019-05-16T07:05:15.708Z16-05-2019 2019-05-16T07:05:10.375Z - 2019-06-27T11:59:09.093Z - 27-06-2019

యూపీలో బీజేపీకి హ్యాపీ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీలో రాజకీయాలను యూపీ శాసించడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఎక్కువమంది ఎంపీలను అందించే యూపీపై అన్ని పార్టీలు మక్కువ పెంచుకుంటుంటాయి. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆ సర్వేల అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం బీజేపీ ఎస్సీలు, ముస్లింలు మినహాయిస్తే రాష్ట్రంలో అన్ని ప్రధాన వర్గాల ఆదరణ సాధించి సత్తా చాటబోతోందని తెలుస్తోంది. 

ఇందుకు ప్రధానంగా ఎస్పీ-బీఎస్పీ కూటమి ఓబీసీలు, ఇతర నిమ్న వర్గాల మద్దతు తమకే ఉందని చెప్పుకోవడం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రచారంతో ఆ పార్టీ ఓటింగ్ పెరగడం కారణంగా ఎన్డీటీవీ విశ్లేషణలో తేలింది. కేవలం రెండు సీట్లు మాత్రమే తమకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రియాంకను రంగంలోకి దించింది. దీంతో ఆ పార్టీకి జోష్ పెరిగింది. దాదాపు పది శాతం వరకూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎన్డీటీవీ పరిశీలననలో తేలింది. 

కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అలా ఉంచితే, ఎస్పీ బీఎస్పీ కూటమి ఓట్లలో గణనీయంగా చీలిక తీసుకువస్తుందని మాత్రం తేలింది. ఫలితంగా ఇది బీజేపీకి లాభ పడే అంశంగా ఆ విశ్లేషణ పేర్కొంది. పిట్టపిట్ట పోరు పిల్లి తీర్చిందన్న చందంగా యూపీ ఎన్నికలు మారబోతున్నాయంటున్నారు. ఇక ఓబీసీ వర్గాల్లో 55 శాతం మంది బీజేపీకే అనుకూలంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. మహా కూటమి(ఎస్పీ,బీఎస్పీ) కి 35 శాతం మంది, కాంగ్రెస్ కు 10 శాతం వరకూ ఆ వర్గాల్లో ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. 

పైగా ఓబీసీలు, ఇతర నిమ్న వర్గాలు తమకే మద్దతు పలుకుతున్నాయని కూటమి నేతలు ఊదరగొట్టడం కూడా దానికి నష్టం కలిగించింది. ఈ ప్రచారంతో అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గమంతా ఏకమై బీజేపీకే సపోర్టు చేస్తున్నారని, ఇది బీజేపీకి పన్నీటి జల్లే అంటున్నారు. బీజేపీకి దాదాపు 15 శాతం ఎస్సీ వర్గం ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఆ స్థానంలో అగ్రవర్గాల ఓట్లు బీజేపీ ఖాతాలో పడనున్నాయి. కీలకమైన ఈ హిందీ రాష్ట్రం లో మొత్తం మీద ఎస్పీ బీఎస్పీ కూటమి కంటే బీజేపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని సర్వే తేల్చింది. దీంతో యూపీ బీజేపీ నేతలు ఖుషీగా ఉన్నారు. మళ్ళీ మోడీయే ప్రధాని అన్న దీమాతో వారు ముందుకెళుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle