newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూపీలో టెన్షన్ టెన్షన్.. సీఏఏ నిరసనలపై నిఘా

27-12-201927-12-2019 09:19:02 IST
Updated On 27-12-2019 11:04:27 ISTUpdated On 27-12-20192019-12-27T03:49:02.297Z27-12-2019 2019-12-27T03:48:20.106Z - 2019-12-27T05:34:27.517Z - 27-12-2019

యూపీలో టెన్షన్ టెన్షన్.. సీఏఏ నిరసనలపై నిఘా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన వ్యక్తం అవుతూనే వుంది. యూపీలో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగుతోంది. ఇవాళ శుక్రవారం కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఎలాంటి హింసాకాండ చెలరేగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆగ్రా, ఘజియాబాద్, బులంద్‌సెహర్, అలీగఢ్, బిజ్నూర్, ఫిరోజాబాద్, ముజఫర్‌నగర్, సంభల్, షామ్లి జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే నిలిపేశారు.

గోరఖ్‌పూర్‌లో జరిగిన హింసాకాండ కు అవకాశం లేకుండా పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ జరిపారు. అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.

గురువారం ఉదయం 8 గంటల నుంచి నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. బులంద్‌షహర్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను ఈనెల 28 వరకూ నిషేధం కొనసాగుతుంది. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది.

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై ఆందోళనలు కొనసాగించాలని విద్యార్ధులకు సలహా ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది.

ఆమె మతిస్ధిమితం కోల్పోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గీయ ధ్వజమెత్తారు. చొరబాటుదారులను పంపించివేస్తారని ఆమె ఆందోళన చెందుతున్నారని అందుకే మతిస్ధిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని  ఆయన మండిపడ్డారు. అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్న మమతా బెనర్జీకి తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ సలహా ఇచ్చింది. 

పౌరసత్వ సవరణ చట్టంపై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్‌ సీఎం మమత అన్నారు. రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్‌ రావత్‌ తలదూర్చడం కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆయన ప్రధాని పదవిపై కన్నేశారేమో అని యోగేంద్రయాదవ్ విమర్శించారు. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   an hour ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle