newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యువతకు ప్రధాని సందేశం...సీఏఏపై అపోహలు వద్దు

12-01-202012-01-2020 15:06:03 IST
Updated On 13-01-2020 11:36:28 ISTUpdated On 13-01-20202020-01-12T09:36:03.763Z12-01-2020 2020-01-12T09:31:18.170Z - 2020-01-13T06:06:28.295Z - 13-01-2020

యువతకు ప్రధాని సందేశం...సీఏఏపై అపోహలు వద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యువతకు సందేశం ఇచ్చారు. సీఏఏ దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వ హక్కును భంగం కలిగించదని హామీ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న ఆయన.. బేలూరు మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఏఏ ప్రాధాన్యత గురించి యువత తెలుసుకోవాలన్నారు. మనచుట్టూ ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని వాటిని నమ్మ వద్దన్నారు. పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం పలుమార్లు వివరణ ఇచ్చినా స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో విపక్షాలు ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నాయని అన్నారు. 

సీఏఏపై కొన్ని పార్టీలు అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, దీంతో యువత విసిగి వేసారి పోతోందని అన్నారు. వాస్తవ సమాచారంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈశాన్య ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు వాస్తవాలు గ్రహించి ముందుకు సాగాలన్నారు. ‘‘నేను మళ్లీ చెబుతున్నా... సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు... ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.. ప్రజలు సీఏఏని పూర్తిగా అర్థం చేసుకున్నారు’’ అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

పాకిస్థాన్‌లోని మైనారిటీలు ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నారని…. ఆ విషయం ప్రపంచానికి అర్థమౌతుందన్నారు. గడిచిన 70 ఏళ్లుగా మైనార్టీలపై పాకిస్థాన్‌ ఎందుకు దారుణాలకు పాల్పడిందో సమాధానం చెప్పాలన్నారు. 

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. స్వయంగా బెంగాల్లో పర్యటిస్తున్నా సీఎం మమతా బెనర్జీకి ఆయన షాకిచ్చారు. కోల్‌కత నౌకాశ్రయానికి భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు.

నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  గైర్హాజరవడం గమనార్హం. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాందవియా హాజరయ్యారు. 

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle