యాక్సిడెంటల్ సీఎంని కాను.. ప్రజలెన్నుకున్న సీఎంని.. పళనిస్వామి
19-10-201919-10-2019 11:52:49 IST
2019-10-19T06:22:49.209Z19-10-2019 2019-10-19T06:22:43.818Z - - 11-04-2021

తమిళనాడులోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పరస్పర విమర్శల్లో మునిగితేలుతున్నారు. శుక్రవారం ఒక బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామిని యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అని విమర్శించారు. దీనికి సీఎం ఎదురు సమాధానమిస్తూ తాను అనుకోకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదని, తమిళనాడు ప్రజలు తనను సీఎంగా ఎన్నుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియడం తెలిసిందే. యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ దొరకడం మన దురదృష్టం. తనను ప్రజలు ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజంగా తనను ప్రజలు ఎన్నుకున్నారా లేక మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మికంగా మరణిస్తే ముఖ్యమంత్రి అయ్యారా అని డీఏంకే అధినేత స్టాలిన్ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు అనుకూల పరిణామాలు ఏర్పడకపోవడం వల్లే పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చోగలిగారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి విక్రవండి నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో బదులిచ్చారు. 122 మంది ఎమ్మెల్యేలు నా పార్టీ తరపున నన్ను సీఎంగా ఎన్నుకున్నారు. అలాంటప్పుడు నేను యాక్సిడెంటల్ సీఎంని ఎలా అవుతాను? మా పార్టీకి చెందిన 122 మంది ఎమ్మెల్యేలను మీలాంటి ప్రజలే ఎన్నుకున్నారు. వారు ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వం ఏర్పడాలంటే రాష్ట్ర అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన మెజారిటీ అవసరం. నాకు 122 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు కాబట్టే ముఖ్యమంత్రిని కాగలిగాను అని పళనిస్వామి బదులిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన అధికార అన్నాడీఎంకే ఉప ఎన్నికల్లో 9 స్థానాలు గెల్చుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది. అదే సమయంలో డీఎంకే ఉపఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు సాధించింది. దీంతో అన్నాడీఎంకేకి అసెంబ్లీలో బలం 123 స్థానాలకు పెరగగా డీఎంకే దాని మిత్ర పక్షాలు 108 స్థానాలు దక్కించుకున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో అధికారపార్టీపై తిరుగుబాటు అభ్యర్థి ఏఎమ్ఎమ్కే చీఫ్ టీవీ దినకరన్ ఒక్కరే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిపక్షం, ప్రభుత్వం మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ఉపఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా