newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యముడు కూడా రాజీనామా చేస్తాడు.. ఢిల్లీ అల్లర్లపై శివసేన ధ్వజం

09-03-202009-03-2020 12:31:15 IST
Updated On 09-03-2020 17:02:44 ISTUpdated On 09-03-20202020-03-09T07:01:15.782Z09-03-2020 2020-03-09T07:01:12.683Z - 2020-03-09T11:32:44.258Z - 09-03-2020

యముడు కూడా రాజీనామా చేస్తాడు.. ఢిల్లీ అల్లర్లపై శివసేన ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందువులుగా, ముస్లింలుగా మనుషులను వేరుచేసి ఢిల్లీ అల్లర్ల సమయంలో కేంద్రప్రభుత్వ సాగించిన పరమ అనాగరిక చర్యలకు నరకలోకాధిపతి యముడు సైతం సహించలేక రాజీనామా చేస్తాడని శివసేన అధికార పత్రిక సామ్నా ఎన్డీయే ప్రభత్వంపై ధ్వజమెత్తింది. ఢిల్లీ అల్లర్లపై శివసేన సామ్నా వేదికగా కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడింది. 

ఢిల్లీలో జరిగిన అల్లర్లు హృదయాన్ని కదిలించేవి. అమానవీయంగా జరిగిన కక్షసాధింపు చూసి యమ ధర్మరాజు కూడా తన పదవికి రాజీనామా చేస్తాడు. హిందు, ముస్లిం మతాలకు చెందిన అనేక మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. అనాథలతో కూడిన కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ముదస్సార్ ఖాన్ కుమారుడి ఫోటో ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు అచ్చు వేశాయి’’ అని కేంద్రంపై శివసేన ధ్వజమెత్తింది. 

‘‘ఓ తండ్రి శవం ముందు కొడుకు నిల్చున్న ఫోటో దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని సామ్నా పేర్కొంది. ఢిల్లీ అల్లర్లలో 50 మందికి పైగా హింసలో ప్రాణాలు కోల్పోయారని, వీరి ప్రాణాలు తీసిందెవరని సూటిగా ప్రశ్నించారు. 

అసలు లెక్క 50 కాదని, వందమంది పైగానే ప్రాణాలు కోల్పోయారని సామ్నా ఆరోపించింది. 500 మందికి పైగా అల్లర్లలో గాయపడ్డారని, ఎందరో అనాథలయ్యారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా సరే, హిందూ, ముస్లిం ప్రాతిపదికగా సమాజం మనుషులను చూస్తే, మానవత్వం చనిపోయినట్లేనని శివసేన అభిప్రాయపడింది. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల్లో గెలుపు సాధించడానికి చిన్న సైజు యుద్ధాన్నే చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయని సామ్నా పేర్కొంది. ఇలాంటి పుకార్లు మరింతగా వ్యాపించి బలం పుంజుకునేలా పాలకులు వ్యవహరించకూడదని సామ్నా సూచించింది. 

ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా యుద్ధం చేయడానికి బీజేపీ నడుం కట్టింది. కానీ ఢిల్లీలో జరిగిన అల్లర్లు, భీకరదాడులు వంటివాటిని రాజకీయ లాభాలకోసం పాలకపార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకోవద్దని  సేన అధికార పత్రిక సామ్నా తెలిపింది.

ఇప్పటికే కశ్మీర్‌లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనుసరించిన ఇలాంటి విధానాలవల్ల అక్కడి ప్రభుత్వం మరిన్ని సమస్యల్లో కూరుకుపోయిందని సామ్నా కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించింది.

1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిపించిన సిక్కు వ్యతిరేక దమనకాండకు కాంగ్రెస్‌ ఇప్పటికీ భారీ మూల్యం చెల్లిస్తూనే ఉందన్న విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వం మర్చిపోవద్దని శివసేన వాణి సూచించింది. ఏకారణంతో, ఎక్కడ అల్లర్లు, హింసాత్మక చర్యలు జరిగినా సరే వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అవి వికటిస్తాయని సామ్నా హెచ్చరించింది.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle