మహారాష్ట్రలో పతంగి ఎగరేస్తారా..?
17-10-201917-10-2019 17:47:22 IST
2019-10-17T12:17:22.931Z17-10-2019 2019-10-17T12:17:21.326Z - - 12-04-2021

హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకూ విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ ఈ పనిపైనే చాలా రోజులుగా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటి ఎంఐఎంను ఇతర ప్రాంతాలకు మరింత వేగంగా విస్తరించాలని అసద్ వ్యూహాలు పన్నుతున్నారు. మహారాష్ట్రలోని ముస్లింలు మెజారిటీ ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి కొంత పట్టుంది. ముఖ్యంగా ఔరంగాబాద్, నాందేడ్, షోలాపూర్ ప్రాంతాల్లో ఎంఐఎంకు మంచి క్యాడర్ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 24 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం బైకుల్లా, ఔరంగాబాద్ సెంట్రల్ స్థానాలను గెలుచుకుంది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ శివసేన - బీజేపీ కూటమికి చిన్న టైప్ షాక్ ఇచ్చింది. ఔరంగాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. హైదరాబాద్ మినహా ఇతర స్థానాల్లో ఎంఐఎం గెలవడం అదే మొదటిసారి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు విజయావకాశాలు ఉన్న, ముస్లింలు ఎక్కువగా ఉన్న 44 సీట్లను ఎంపిక చేసుకున్న ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం అసదుద్దన్ ఓవైసీ, అక్బరుద్దిన్ ఓవైసీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముస్లింలను ఆకర్షించేందుకు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బీజేపీకి ముస్లింలపై ప్రేమ ఉంటే మరాఠాలకు ఇచ్చినట్లుగానే ముస్లింలకు సైతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లింల గురించి ఆలోచించే ఏకైక పార్టీ తమదే అని చెప్పుకుంటున్నారు. కానీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ స్థాపించిన వంచిత్ బహుజన్ అగాడీ(వీబీఏ)తో పొత్తు లేకపోవడం ఎంఐఎంకు పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి బాగానే ఓట్లు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల ఓట్లు అంటే 14 శాతం ఓట్లు వీరికి వచ్చాయి. కానీ ఒకే ఎంపీ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంది. ఈ రెండు పార్టీల కూటమి బీజేపీ - శివసేన వ్యతిరేక ఓట్లను, సెక్యూలర్ ఓట్లను చీల్చడం కాంగ్రెస్, ఎన్సీపీకి బాగా నష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసికొట్టడంతో ఎంఐఎం, వీబీఏ పొత్తు కుదరలేదు. దీంతో రెండు పార్టీలు ఒంటరి పోరు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో వీబీఏకు ఓటు బ్యాంకు ఉంది. ముస్లింలలో ఎంఐఎంకు ఆదరణ ఉంది. దీంతో రెండు పార్టీలు కలిస్తే మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఎంఐఎం కూడా ముస్లింలనే కాకుండా ఇతర వర్గాలనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా కొంత పేరున్న హిందూ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఏకంగా 13 మంది హిందువులకు ఎంఐఎం టిక్కెట్లు దక్కాయి. ముస్లిం ఓట్లతో పాటు ఎస్సీ ఓట్లు కూడా పెంచుకుంటే ఎక్కువ స్థానాల్లో గెలవవచ్చు అనేది ఎంఐఎం వ్యూహం. మొత్తానికి ఈసారి మహారాష్ట్రలో పతంగి(ఎంఐఎం ఎన్నికల గుర్తు)ను జోరుగా ఎగరేయాలని అసదుద్దిన్ భావిస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా