newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

05-04-202005-04-2020 20:44:04 IST
2020-04-05T15:14:04.786Z05-04-2020 2020-04-05T15:13:12.417Z - - 17-04-2021

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ క‌నుగొన‌లేదు. క‌రోనా నివార‌ణ‌కు మందు క‌నిపెట్టే ప‌రిశోధ‌న‌లు భార‌త్‌తో పాటు ఇంకా చాలా దేశాలు, ప‌రిశోధ‌న సంస్థ‌లు జ‌రుపుతున్నాయి. ప్ర‌స్తుతం ఇందులో చాలా వ‌ర‌కు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉండ‌గా, మ‌రికొన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సిద్ద‌మ‌య్యాయి. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటీవ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే 12.14 ల‌క్ష‌ల పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. 64 వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అగ్ర‌రాజ్యం అమెరికాలో ఎక్కువ‌గా ఉంది. క‌రోనా కార‌ణంగా ఎక్కువ కేసులు అమెరికాలో న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశంలో 3.11 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు కాగా 8 వేల‌కు పైగా ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి చేసిన విజ్ఞ‌ప్తి ఆస‌క్తిక‌రంగా మారింది. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును త‌మ‌కు పంపించాల‌ని విన‌వించారు.

ఇటీవ‌లి కాలంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ హైడ్రాక్సీక్లోరోక్విన్ పేరు త‌ర‌చూ వినిపిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవ‌ల శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ క‌రోనాకు విరుగుడుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ బాగా ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ - అజిథ్రోమైసిన్ డ్ర‌గ్స్ క‌ల‌యిక కోవిడ్‌పై పోరాటంలో గేమ్ చేంజ‌ర్ కావ‌చ్చ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప‌లు ప‌రిశోధ‌న సంస్థ‌లు కూడా ఈ విష‌యాన్ని చెబుతున్నారు. ఇటీవ‌ల ఇండియన్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రిసెర్చ్‌(ఐసీఎంఆర్) కూడా క‌రోనా మ‌హ‌మ్మారికి విరుగుడుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ప‌ని చేస్తోంద‌ని తేల్చింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ద‌శాబ్దాలుగా మ‌లేరియాకు మందుగా వాడుతున్నారు. ప్ర‌తీ యేటా మ‌లేరియా భార‌త్‌లో వ్యాపిస్తూ ఉంటోంది. ఈ వ్యాధిని భార‌త్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోనే ఎదుర్కుంది. భార‌త్‌లో ఈ మందు ఎక్కువ‌గా త‌యార‌వుతోంది. ప్ర‌పంచ‌దేశాల‌కు కూడా పెద్ద ఎత్తున ఎగుమ‌తి చేస్తోంది.

అయితే, క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న వేళ పారాసెట‌మ‌ల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ప‌లు మందుల ఎగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. క‌రోనా వైర‌స్ చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డే మందులుగా భావించిన అన్ని మందుల‌కు భ‌విష్య‌త్‌లో కొర‌త ఉండ‌కుండా చూసేందుకు కేంద్రం వీటి ఎగుమ‌తుల‌ను నిషేధించింది.

దీంతో ఇప్పుడు ట్రంప్ విజ్ఞ‌ప్తిని ప్ర‌ధాని మోడీ మ‌న్నించి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అమెరికాకు పంపిస్తారో లేదో చూడాలి. అయితే, ప్ర‌ధాని మోడీ సానుకూలంగా ఉన్నార‌ని ట్రంప్ చెప్పారు. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేందుకు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో మ‌లేరియా చికిత్స‌కు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ క‌రోనా చికిత్స‌కు కూడా స‌త్ఫ‌లితాలు ఇస్తుండ‌టం కొంత ఊర‌ట‌ను ఇస్తోంది. అయితే, క‌రోనా సోక‌కముందు ముందుగానే స్వ‌యంగా ఈ మెడిసిన్ తీసుకోవ‌డం మంచిది కాద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle