మరో ఆపరేషన్‌కు కూడా సిద్ధమే..?
03-12-201903-12-2019 07:58:14 IST
2019-12-03T02:28:14.394Z03-12-2019 2019-12-03T02:25:56.012Z - - 14-04-2021

కర్ణాటకలో ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మరో పరీక్ష ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జేడీఎస్‌ను విభేదించి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలకు చెందిన 15 నియోజకవర్గాల్లో 5వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా 15 సీట్లలో ఎనిమిది సీట్లు గెలవాల్సిందే. దీంతో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ కూడా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ఈ నియోజకవర్గాల్లో శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తోంది. ఇక, తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్, జేడీఎస్ కూడా బాగానే ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, దినేష్ గుండూరావు, డీకే శివకుమార్, జేడీఎస్ తరపున దేవెగౌడ, కుమారస్వామి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి గెలిచిన వారే ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలూ కొత్త అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో అనూహ్య మార్పులు వస్తాయని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. డిసెంబర్ 9 తర్వాత బీజేపీ అధికారం కోల్పోక తప్పదని జోస్యం చెబుతున్నారు. బీజేపీ మాత్రం కచ్చితంగా తాము 15 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి నల్లేరు మీద నడకగా అయితే కనిపించడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఎదురవుతోంది. బీజేపీ అభ్యర్థులు తమ పార్టీలకు వెన్నుపోటు పొడిచి అధికారం కోసం బీజేపీలోకి వెళ్లారని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే, వారిది ఫిరాయింపు కాదని, వారి త్యాగం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రివర్స్ ప్రచారం చేస్తోంది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వారికి మంత్రి పదవులు ఇస్తామని కూడా బీజేపీ ప్రచారం నిర్వహించింది. అయితే, డిసెంబర్ 9న ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వాన్ని మాత్రం కాపాడుకునేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అవసరమైతే మరో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన ఎనిమిది సీట్లు రాకపోయినా కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ కూడా ఇందుకు ప్రతి వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్ 9న వెలువడే ఫలితాలను బట్టి మరో సారి ఈ రెండు పార్టీలు కలిసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఈ మేరకు రాష్ట్ర పార్టీకి సూచనలు అందాయి. ఒకవేళ బీజేపీ కనుక 8 సీట్లు గెలుచుకోలేకపోతే మరోసారి కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
6 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
10 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
11 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
12 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
14 hours ago
ఇంకా