newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం.. ఆర్థిక వ్యవస్థ మందగమనం

02-09-202002-09-2020 15:32:53 IST
2020-09-02T10:02:53.161Z02-09-2020 2020-09-02T10:02:50.065Z - - 17-04-2021

మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం.. ఆర్థిక వ్యవస్థ మందగమనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం మరోసారి నరేంద్ర మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. 40 ఏళ్లలో తొలిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొంటోంది..ఇది ఈరోజు వెల్లడైన జీఎస్టీ గణాంకాల్లో నిర్ధారించబడినా సత్యానికి కట్టుబడలేనివారు దేవుడిపై నెపం నెడుతున్నార’ని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతవారం చేసిన దైవ ఘటన (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో దేశ జీడీపీ ఎన్నడూలేని విధంగా 23.9 శాతం పతనమైన విషయం తెలిసిందే. జీడీపీ-23.9..నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం మొదలవగా, ఆపై ప్రభుత్వం ఒకదాని వెంట ఒకటిగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

నోట్ల రద్దు, లాక్‌డౌన్‌, జీఎస్టీ నిర్ణయాలతో అసంఘటిత రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్థిక సునామీ దేశాన్ని ముంచెత్తకుండా కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ వంటి అగ్రదేశాలు సమస్యల్లో కూరుకుపోయాయని, అమెరికాలో బ్యాంకులు దెబ్బతిని వాణిజ్య సంస్థలు మూతపడితే భారత్‌లో మాత్రం ప్రతికూల ప్రభావం లేదని రాహుల్‌ పేర్కొన్నారు. 

ఆ సమయంలో తాను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలిసి ప్రపంచమంతా మాంద్యంలో కూరుకుపోతే భారత్‌ ఎందుకు ప్రభావితం కాలేదని అడిగాను. దానికి  మన్మోహన్‌ బదులిస్తూ భారత్‌లో బడా సంస్ధలతో కూడిన వ్యవస్థ, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, రైతులతో కూడిన అసంఘటిత వ్యవస్థ అంటూ రెండు ఆర్థిక స్వరూపాలు ఉన్నాయని, అసంఘటిత వ్యవస్థపై ప్రభావం లేనంతవరకూ భారత్‌ పట్టు కోల్పోదని అన్నారని గుర్తుచేశారు. 

కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత రంగాన్ని నిర్వీర్యం చేసి వారి నుంచి డబ్బును గుంజేయాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. ఫలితంగా భారత్‌ ఉద్యోగాలు సృష్టించలేని పరిస్థితి ఎదురైందని, దేశంలో 90 శాతం ఉద్యోగాలు అసంఘటిత రంగం నుంచే సమకూరుతున్నాయని గుర్తెరగాలన్నారు. 

ఈ దేశాన్ని ముందుకు నడిపించే మీపై కుట్ర జరుగుతోంది..మిమ్మల్ని మోసగించి బానిసలుగా మార్చాలని చూస్తున్నారు..ఈ దాడిని మనం పసిగట్టి వీరి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు చేయాల’ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో ప్రజలను ఉద్దేశించి రాహుల్‌ పేర్కొన్నారు.

హ్యాండ్ ఆఫ్ గాడ్‌పై ఆగని విమర్శలు

కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు పి. చిదబంరం మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ‘దేవుడిని నిందించవద్దు. నిజానికి మీరు దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు రైతులను ఆశీర్వదించాడు. మహమ్మారి ప్రకృతి విపత్తు. కానీ మీరు వైరస్‌ను మానవ నిర్మిత విపత్తుతో కలిపేస్తున్నారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. 

ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా నెల‌కొన్న ఆర్థిక కొర‌త నేప‌థ్యంలో పరిహారం కోరుతూ రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో 41వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా సైతం జీడీపీ పతనంపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోదీజీ.. మీరు ఒకప్పుడు అద్భుత అస్త్రాలుగా అభివర్ణించినవి తుస్సుమన్నాయని ఇప్పుడైనా అంగీకరించండని వ్యాఖ్యానించారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   22 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   15 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle