newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ, షాతో సింధియా భేటీ.. కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం

10-03-202010-03-2020 13:13:37 IST
Updated On 10-03-2020 16:49:27 ISTUpdated On 10-03-20202020-03-10T07:43:37.350Z10-03-2020 2020-03-10T07:43:34.693Z - 2020-03-10T11:19:27.653Z - 10-03-2020

మోదీ, షాతో  సింధియా భేటీ.. కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవలికాలంలో ఎన్నడూ ఎరుగనంత పెను సంక్షోభం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టింది. అనుమానాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీని, హోమంత్రి అమిత్‌షాతో మంగళవారం భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ సర్కార్‌లో తలెత్తిన సంక్షోభం హస్తినకు చేరింది. జ్యోతిరాదిత్య సింధియా తన విధేయులైన 16 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కొద్ది సేపటి క్రితమే ఆయన ప్రధాని మోదీ నివాసానికి బయలుదేరారు. ఈ పరిణామాలతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కార్‌లో తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరిందని చెబుతున్నారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశంతో సింధియాతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చర్చలు జరిపారని, ఆయనను రాజ్యసభకు పంపుతామని బుజ్జగించే ప్రయత్నం చేశారని సమాచారం. అయితే, సింధియా వెనక్కి తగ్గలేదని, చర్చలు విఫలమయ్యాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు సింధియా దాదాపు తలుపులు మూసేశారని అంటున్నారు. అనంతరం ఆయన మోదీ నివాసానికి బయలుదేరడం సంచలనమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం ఇదే సమయానికి మోదీ నివాసానికి చేరుకోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది. తాజా పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం తీవ్రమవుతోంది. జ్యోతిరాదిత్య సింధియా విధేయులైన 20 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు మంగళవారంనాడు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నారు. సింధియా మద్దతుదారులైన మంత్రులతో సహా సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి సమాచారం లేకుండా సోమవారంనాడు బెంగళూరుకు తరలిపోవడంతో తాజా రాజకీయ సంక్షోభం మొదలైంది. 

ఫోనులో సైతం వారెవరూ అందుబాటులోకి రాకపోవడంతో కమల్‌నాథ్ వెంటనే రంగంలోకి దిగారు. సోమవారం పొద్దుపోయిన తర్వాత సీనియర్ నేతలతో తన నివాసంలో అత్యవసర సమావేశం జరిపారు. సమావేశానంతరం ఆయన క్యాబినెట్‌లోని మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు. ముఖ్యమంత్రి పట్ల వారు తమ విధేయతను ప్రకటిస్తూ, మంత్రివర్గ పునవ్వవస్థీకరణ చేపట్టాలని కమల్‌నాథ్‌ను కోరారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని రెండురోజులుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు, మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపాదన చేసినట్టు కూడా చెబుతున్నారు. సింధియా సోమవారంనాడు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను వ్యాఖ్యానించేదేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చే ఆలోచన బీజేపీకి లేదనే విషయం మొదట్నించీ తాను చెబుతూనే ఉన్నానని చెప్పారు. ప్రభుత్వం కూలిపోతే అది ఆ పార్టీ స్వయంకృతమే అవుతుందని అన్నారు.

గత కొంతకాలంగా సింధియా కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండటం తెలిసిందే. కొంతకాలం క్రితం జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయానికి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ నేతల జాబితాను సింధియా ప్రకటించి దిగ్భ్రాంతి కలిగించారు. ఈ అంశంపై పార్లమెంటులో జరిగిన చర్చలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందంటూ పార్టీ పంథాకు భిన్నంగా సింధియా మాట్లాడారు కూడా.

ప్రస్తుతం మద్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల దన్ను ఉంది. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీ అయిన 116 సీట్లకంటే కేవలం 4 సీట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా నెట్టుకొస్తోంది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle