newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

04-04-202004-04-2020 15:46:18 IST
Updated On 04-04-2020 15:50:55 ISTUpdated On 04-04-20202020-04-04T10:16:18.612Z04-04-2020 2020-04-04T10:16:15.524Z - 2020-04-04T10:20:55.550Z - 04-04-2020

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా చీకట్లను తరిమికొట్టడానికి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా తమ ఇళ్లలో లైట్లు అన్నీ ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చి లైట్లు, మొబైల్స్‌లో ప్లాష్‌లైట్లు తొమ్మిది నిమిషాల పాటు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు పట్ల రాజకీయ నాయకుల్లో పూర్తి భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంలో వేలుపెట్టడానికి నిరాకరించారు. 

సాధారణంగానే మోదీ అన్నా, అమిత్ షా అన్నీ ఒంటికాలిమీద లేచి సై అంటే సై అనే మమత తన పార్టీ నేతలు ఒకవైపు మోదీ పిలుపుపై విరుచుకుపడుతున్నప్పటికీ తాను మాత్రం సంయమనం పాటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. లాక్ డౌన్‌తో అన్ని అవకాశాలు కోల్పోయి దిక్కులేని పక్షుల్లా ఉన్న ప్రజలకు ఏదైనా ప్యాకేజీ ప్రకటించడం పోయి గత 10 రోజులుగా చప్పట్లు కొట్టించడం, దీపాలు వెలిగించడం వంటి పిలుపులకు పరిమితమవుతున్న ప్రధాని మోదీకి బెంగాల్ దీదీ అనుకోని విధంగా వత్తాసు పలికారు. పైగా ప్రధాన మోదీ వ్యవహారాల్లోకి నేనెందుకు తలదూర్చాలి అని మమత ఎదురు ప్రశ్నించారు.

మోదీ తాజా ప్రకటన పట్ల స్పందించడానికి మమత నిరాకరించారు. ఇప్పుడు తన దృష్టి ఇంతా కరోనా వైరస్‌తో తలపడటమేనని, ఇలాంటి కీలక తరుణంలో రాజకీయాను చేయడానికి తాను సిద్ధంగా లేనని మమతా తే్ల్చి చెప్పేశారు. నేను కరోనాతో వ్యవహరించాలా లేక రాజకీయాలు ప్లే చేయాలా.. ప్రస్తుత పరిస్థితుల్లో  నేను రాజకీయ యద్ధం ప్రారంభించాలని మీరెందుకు కోరుకుంటున్నారు. దయచేసి ప్రస్తుతానికి రాజకీయ యుద్ధం ప్రారంభించకండి అని మమత మీడియాకు హితవు చెప్పారు. 

మోదీ ఆలోచనలను ఇష్టపడుతున్న వారు ఆయన ఇచ్చిన పిలుపుకు సమాధానం  ఇవ్వాలి. దాంట్లో నేనెందుకు జోక్యం చేసుకోవాలి. నేను నిద్రపోవాలి అనుకుంచే నిద్రపోతాను. అది పూర్తిగా న వ్యక్తిగత వ్యవహారం అంటూ మమత మోదీ పిలుపుపై స్పందించడానికి నిరాకరించారు.

కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా  ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. చప్పట్లు, దీపాలు వెలిగించడాలు వంటి భ్రమలు వీడి మోదీ ఇప్పటికైనా వాస్తవంలోకి వస్తే మంచిదని ఆమె చెప్పారు.

దీపాలు వెలిగించడం, బాల్కనీలో తప్పట్లు కొట్టడం.. ఏమిటిదంతా... ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలోకి రండి మోదీజీ. జీడీపీలో 10 శాతం విలువ చేసే ద్రవ్య ప్యాకేజీని దేశానికి తక్షణం కేటాయించండి. భవన నిర్మాణ కార్మికులకు, ఇతర శ్రామిక జనాలకు తక్షణం వేతనాలకు హామీ ఇవ్వండి. అంతేకాని నకిలీ వార్తలను అడ్డుకునే ముసుగులో నిజమైన, బాధ్యతాయుతమైన ప్రెస్‌కు గంతలు కట్టకండి అని మహువా మోదీని విమర్సించారు

కేంద్రంతో మమతా బెనర్జీ సంబంధాలు, చర్చలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టాయి. ఈ వారం మొదట్లో మాత్రమే ఆమె కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉత్తరం రాశారు. తమ రాష్ట్రానికి రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పీపీఈలు వంటి ఆరోగ్య సామగ్రి కొరతగా ఉందని, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని రకాల వైద్య సామగ్రి అందుబాటులో లేకుండా పోయిందని మమత వివరించారు.

కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఒక వీడియో సందేశంలో ప్రధాని దాదాపుగా 11 నిమిషాల సేపు మాట్లాడారు. 

కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంపట్ల శాస్త్రీయ దృష్టిలో డేటాను సమీకరించి సైంటిఫిక్ టెంపర్‌తో వైరస్‌పై యుద్ధం ప్రకటించే దిశలో చర్యలు తీసుకోవడం మాని చప్పట్లు, దీపాల వెలిగింపులతో ముందుకు పోతున్న ప్రధాని పిలుపులపై రానురానూ విమర్శలు పెరుగుతుంటడం గమనార్హం.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle