మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం
05-12-201905-12-2019 13:28:09 IST
2019-12-05T07:58:09.546Z05-12-2019 2019-12-05T07:58:01.159Z - - 22-04-2021

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మోడీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నడిపించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు, మనీ ల్యాండరింగ్ కేసుల్లో చిదంబరం బెయిల్పై బుధవారం రాత్రి విడుదలయిన సంగతి తెలిసిందే. 106 రోజులు తీహార్ జైలులో ఉన్నారు చిదంబరం.
ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. అయితే చిదంబరం మాత్రం మీడియా ముందు తన వాణి వినిపించారు.
దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయిందని చిదంబరం అన్నారు. వివిధ రంగాల్లో వేతనాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతం అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని ఇందుకు ఆర్బీఐ అసమర్ధ అంచనా కారణమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా అని చిదంబరం ప్రశ్నించారు.

మోదీ సర్కార్ ఆర్థికవ్యవస్థను కోలుకోలేని కుప్పకూల్చిందని, ఎకానమీపై ప్రధాని నోరు మెదపడం లేదని చిదంబరం మండిపడ్డారు. పార్లమెంటులో తన గళాన్ని నొక్కేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఉల్లిధరలపై కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు చిదంబరం. ఉల్లిపాయ తినని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు.
ఆవిడ ఆవకాడో తింటారా అని చిదంబరం ఎద్దేవా చేశారు. రాజ్యసభ సమావేశాల్లో చిదంబరం అనేక అర్థిక అంశాలను ప్రస్తావించనున్నారు. సాయంత్రం మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా