మోడీ, షా వ్యూహం ఫలించినట్లేనా?
22-10-201922-10-2019 16:02:37 IST
2019-10-22T10:32:37.676Z22-10-2019 2019-10-22T10:32:28.413Z - - 17-04-2021

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే మోడీ, షా వ్యూహాలు ఫలించినట్లే కనిపిస్తున్నది. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా...వారి ప్రచారాన్ని కూడా తమ పంథాలోనే సాగేలా మోడీ, షా ద్వయం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగారు. ఆ ఉచ్చులో విపక్షాలు పడ్డాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ గమనించకుండా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు ప్రజల మససులను గెలుచుకోవడంలో విఫలమయ్యాయి. దేశ భక్తి అనే భావోద్వేగ పూరిత, ఉద్వేగ భరిత నినాదం ముందు స్థానిక సమస్యల ప్రస్తావన వెలతెలా పోయింది. అంత మాత్రాన విపక్షాలు తమ ప్రచారంలో ప్రస్తావించిన సమస్యలను జనం పట్టించుకోవడం లేదని భావించజాలం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో...మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆ సమస్యల కంటే...పాకిస్థాన్ పై పై చేయి సాధించామన్న ఉద్వేగమే ప్రధాన అజెండాగా మారిపోయింది. అందుకే విపక్షాల ప్రచారం చప్పగా సాగిందనీ, అజెండా లేదనీ జనం భావించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా బీజేపీ దాదాపుగా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న పలు సమస్యలు విలయతాండవం చేస్తున్నా...పుల్వామా ఉగ్రదాడి, బాల్ కోట్ సర్జికల్ స్ట్రైక్ లో ప్రజల విచక్షణపై, నిర్ణయంపై బలమైన ముద్ర వేశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని గమనించిన తరువాత వచ్చే ఎన్నికలలో ఎటువంటి వ్యూహం అనుసరించాలన్న విషయంలో మోడీ, షా ద్వయానికి ఒక స్పష్టత వచ్చింది. నిత్యం జనాలను ఒక భావోద్వేగ పూరిత వాతావరణంలో ఉంచడం ద్వారా రాజకీయ లబ్ధి అన్నది బీజేపీ విధానంగా మార్చేశారని చెప్పవచ్చు. ప్రజా సంక్షేమ పథకాల ప్రకటనలు చేస్తూనే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను ఇనుమడింప చేసే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటున్నదన్న భావనను జన బాహుల్యంలో ఏర్పడేలా ప్రచార వ్యూహాలను రూపొందించడమే ఆ విధానంగా కనిపిస్తున్నది. ఆర్టికల్ 370 రద్దుపై పొరుగు దేశం పాకిస్థాన్ స్పందించిన తీరు కూడా దేశంలో మోడీ సర్కార్ పట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పడేందుకు దోహదపడింది. దేశ అంతర్గత వ్యవహారంలా పరిగణించి పాకిస్థాన్ పట్టించుకోకుండా ఉండి ఉంటే...ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం ఇంతగా జనంలోనికి చొచ్చుకొని పోయి ఒక భావోద్వేగ అంశంగా మారి ఉండేది కాదు. ద్వైపాక్షికం, అంతర్గతం అంటూనే కేంద్ర సర్కార్ ఒక పకడ్బందీ ప్రణాళికతో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకిగా మిగిలిపోయిందన్న అంశమే దేశ వ్యాప్తంగా వ్యక్తిగతంగా మోడీకీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక గొప్ప పాజిటివ్ వేవ్ ను తెచ్చిపెట్టింది. దాని ఫలితమే...హర్యానా, మహా ఎన్నికలలో స్థానిక సమస్యల ఊసును కూడా జనం వినడానికి సిద్ధ పడని వాతావరణాన్ని కలుగ జేసింది. ఇదే అదునుగా దేశంలో రాజకీయ వాతావరణం నిత్యం వేడిగా ఉంచడం ద్వారా విపక్షాలను మరింత బలహీనం చేసే వ్యూహాలతో బీజేపీ ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తున్నది. ‘జమిలి’ నినాదం. రామమందిర నిర్మాణంపై సుప్రీం తీర్పుకు ముందు యజ్ణాలు ఇవన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ వ్యూహాలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోకుంటే దేశంలో విపక్షాలు మరింత బలహీనం కావడం ఖాయం. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్, ఏపీలో తెలుగుదేశం, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీలు బలహీనపడిన తీరే ఇందుకు నిదర్శనం.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా