మోడీ-షాకి షాక్.. సీఏఏకి మోకాలడ్డిన కేరళ అసెంబ్లీ
31-12-201931-12-2019 16:23:49 IST
2019-12-31T10:53:49.024Z31-12-2019 2019-12-31T10:53:42.259Z - - 23-04-2021

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం మంటలు రాజుకుంటూనే వున్నాయి. యూపీ, కర్నాటక, తమిళనాడు, అసోం.. ఇలా సీఏఏ వ్యతిరేక ర్యాలీలు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటూనే వున్నారు. ఈ సందర్బంగా ఆమె మోడీ-అమిత్ షాల తీరుపై మండిపడ్డారు. పౌర సమాజం నుంచి బీజేపీని ఏకాకిని చేయడానికి అంతా కలిసి రావాలన్నారు. భారతదేశం నుంచి కాషాయ పార్టీని తరిమేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సీఏఏ నిరసనకారులను దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయ త్నిస్తోందని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లోని పురూలియాలో భారీ ర్యాలీలో పాల్గొన్న దీదీ బీజేపీతో పోరాడాలంటే పార్టీలన్నీ ఏకంకావాలన్నారు. శాంతియుత ఆందోళనలను కూడా దేశవ్యతిరేక కార్యక్రమాలుగా బీజేపీ చిత్రీకరిరించం మానుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ..కేరళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కేరళకు లౌకిక రాష్ట్రమన్న గుర్తింపు ఉందని తెలిపారు. గ్రీకులు, అరబ్బులు, రోమన్లు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ప్రతి ఎంతోమంది కేరళలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. కేరళ సంప్రదాయాలకు భంగం వాటిల్లితే సహించేది లేదన్నారు. రాజకీయ పార్టీలు, మతాధిపతులు, సామాజిక నేతలతో జరిగిన ఒక సమావేశంలో వారంతా పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్నట్లు తనతో, ప్రతిపక్షనాయకుడితో చెప్పినట్లు విజయన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కాంగ్రెస్ సైతం సీఏఏ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా