newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ వంద రోజుల పాలనలో ప్రతిష్టను పెంచిన ట్రిపుల్ తలాక్ చట్టం, 370 రద్దు..!

07-09-201907-09-2019 18:24:31 IST
2019-09-07T12:54:31.053Z07-09-2019 2019-09-07T12:54:18.988Z - - 22-04-2021

మోడీ వంద రోజుల పాలనలో  ప్రతిష్టను పెంచిన ట్రిపుల్ తలాక్ చట్టం, 370 రద్దు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ పాలనపై ప్రజల సంతృప్తి స్థాయి అధికంగా ఉందని ఆయన రెండో సారి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక సర్వే పేర్కొంది. ఆర్థిక మందగమనం, కాశ్మీర్, కర్నాటక వంటి రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత, ఉగ్ర బెడద, నిరుద్యోగం వంటి అంశాల మాట పక్కన పెట్టి ఆయన సమర్ధంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారనీ, పాలన భేషుగ్గా ఉందన్న అభిప్రాయపడుతున్న వారి సంఖ్యతో పోలిస్తే ఆయన తీరు బాలేదన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని సర్వే కుండబద్దలు కొట్టింది. ఇంకో విషయమేమిటంటే మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత భారత దౌత్య విజయాల తీరు నభూతో..నాభవిష్యత్ అన్న విధంగా ఉంది. 

ఆర్టికల్ 370 విషయంలో కానీ, కాశ్మీర్ ను ప్రపంచ దేశాలలో ఏకాకిని చేయడంలో కానీ మోడీ సాధించిన ఘనత ఆయన దౌత్య నైపుణ్యం ఆమోఘమని చెప్పాలి. వాజ్ పేయి హయాంలో భారత దౌత్య విధానం సర్వత్రా ప్రశంసలందుకుంది. ఆ తరువాత మళ్లీ మోడీ హయాంలోనే ఆ స్థాయిలో ప్రశంలు వస్తున్నాయి. ఇక రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఈ వంద రోజుల్లో మోడీ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా చట్టం తీసుకురావడం ముఖ్యమైన వాటిలో ముఖ్యమైన నిర్ణయాలుగా చెప్పవచ్చు. 

ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల విషయంలో మోడీ సర్కార్ ఎటువంటి ఉపేక్షకూ తావివ్వరాదన్న విధానాన్ని అవలంబిస్తుండటంతో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. అందుకు నిదర్శనమే కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంల అరెస్టు. అధికారం, రాజకీయం దన్నుగా ప్రజాధనాన్ని పక్కదారి పట్టించి కోట్లకు పడగలెత్తే నాయకులకు డీకే, చిద్దూల అరెస్టు ఒక హెచ్చరికగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక మోడీ వంద రోజుల పాలనలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటివి ప్రజలలో ఆయన పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ఇనుమడింప చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ లో మోడీ నిర్ణయానికి అనుకూలంగా సీనియర్ నేతలు మాట్లాడటం...దేశంలో ప్రజల మూడ్ ఎలా ఉందన్నదానికి అద్దం పట్టింది.

ప్రజల ఏం కోరుకుంటున్నారో తెలిసిన నేతగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయన్న అభిప్రాయం కూడా పరిశీలకుల నుంచి వ్యక్తం కావడం ఆయన సక్సెస్ కు నిదర్శనం. అలాగే ట్రిపుల్ తలాక్ చట్టం తరువాత ముస్లిం దేశాలలో ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వాలు  మోడీని దేశ అత్యున్నత పౌర పురస్కారా ల ప్రదానంతో సత్కరించాయి. అయితే మోడీ పాలనకు, తీరుకు సర్వామోదం లభించిందని చెప్పడానికి వీలు లేదు.  ఆయన విధానాలను విమర్శించే పదునైన గళాలు ఉన్నాయి. బలమైన నేతలు ఉన్నారు. అయితే వారి గళం, వారి బలం మోడీని సమర్ధిస్తున్న వారి గళాల ముందు వినిపించడం లేదు. కనిపించడం లేదు. 

ఆ కారణంగానే తాజా సర్వేలో మోడీ పాలన పట్ల 64శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. వ్యతిరేకించే వారి శాతం 35. అయితే మోడీ తీరు పారదర్శకమా  కాదా అన్న అనుమానాలకు తావిచ్చే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల విషయంలో ఆయన సర్కార్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదన్న ఆరోపణలు హేతుబద్ధంగా ఉంటున్నాయి. అవినీతి ఆరోపణలు, అదే సమయంలో చిదంబరం, డీకే వంటి కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు సంస్థల దూకుడు, వారి అరెస్టు మోడీ సర్కార్ తీరు ద్వంద్వ ప్రమాణాలతో కూడుకుని ఉన్నదా అన్న అనుమానాలకు తీవిస్తున్నది. విమర్శకులు కూడా దీనినే ఎత్తి చూపుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకూ ఏ ప్రధానికీ లభించని విధంగా మోడీకి దేశంలో 64శాతం మంది మద్దతు లభించిందన్నది సర్వే వెల్లడించిన విషయం. అయితే అదే సమయంలో విమర్శలలోని హేతుబద్ధతను కూడా పరిగణనలోనికి తీసుకుని మోడీ అవినీతి నేతల విషయంలో పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ పని చేసుకుపోయే వాతావరణం కల్పించాల్సి ఉంది. అప్పుడు జనంలో సంతృప్త స్థాయి మరింత ఎక్కువ అవుతుంది. అది మోడీ ప్రతిష్ట ఇనుమడించడానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle