మోడీ మార్క్ దౌత్యం.. ఆ రెండు దేశాలకు తిప్పలు..!
21-10-201921-10-2019 12:38:32 IST
2019-10-21T07:08:32.684Z21-10-2019 2019-10-21T07:08:31.173Z - - 23-04-2021

భారత్‌కు ఉన్న అతిపెద్ద శక్తి కొనుగోలు శక్తి. భారత్ మార్కెట్‌పై ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎంతో కొంత ఆధారపడి ఉండేవే. అందుకే భారత్‌తో సత్సంబంధాలకే ఆయా దేశాలు మొగ్గు చూపుతాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దౌత్యపరంగా భారత్ అనేక విజయాలు సాధించింది. చాలా దేశాలను భారత్‌కు అనుకూలంగా మోడీ మరల్చగలిగారు. ఇందుకు భారత్ మార్కెట్ ప్రధాన కారణం. అందుకే ఇటీవల ఐక్యరాజ్యసమితిలో కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై పదేపదే ఆరోపణలు గుప్పించారు. భారత్ మార్కెట్ పెద్దదని, అందుకే ప్రపంచ దేశాలు భారత్ వైపు నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించలేదు. ఇస్లామిక్ దేశాల నుంచి తమకు మద్దతు ఉంటుందని పాక్ భావించినా అలా జరగలేదు. చైనా, మలేషియా, టర్కీ తప్ప ఏ ఒక్క దేశం కూడా పాక్‌కు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ దేశాలపై భారత్ కఠిన వైఖరి అవలంభించాలని భావిస్తోంది. చైనాతో ఇప్పుడే పెట్టుకునేందుకు భారత్ కూడా ఇష్టంగా లేదు. అందుకే మహాబలిపురంలో జిన్ పింగ్‌తో మోడీ సామరస్యంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. ఇక, కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన మలేషియాకు ఇప్పటికే భారత్ చుక్కలు చూపిస్తోంది. కశ్మీర్ విషయంలో భారత్ ఐరాస తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, కశ్మీర్‌ను భారత్ ఆక్రమించిందని మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్ ఆరోపించారు. దీంతో భారత్ అతడికి అప్పుడే గట్టి సమాధానం చెప్పింది. ఇప్పుడు వాణిజ్యపరంగానూ మలేషియాను ఇరుకున పెడుతోంది. మలేషియా ఎక్కువగా ఫామాయిల్ ఎగుమతి చేసే దేశం. మలేషియా నుంచి ఫామాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఇప్పుడు మలేషియా నుంచి ఫామాయిల్ దిగుమతిని తగ్గించేందుకు భారత్ పావులు కదుపుతోంది. దిగుమతి సుంకాన్ని ఐదు శాతం పెంచింది. మరింత పెంచేందుకూ సిద్ధమవుతోంది. మలేషియా బదులుగా ఇండోనేషియా నుంచి ఫామాయిల్‌ను, ఉక్రెయిన్ నుంచి ఎడిబుల్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది భారత్. దీంతో మలేషియా నుంచి ఫామాయిల్ దిగుమతి భారీగా పడిపోయింది. దీంతో విషయం అర్థమైన మలేషియా ప్రధాని క్రమంగా దారిలోకి వస్తున్నారు. భారత్‌తో దౌత్యపరంగా చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. ఇక, భారత్ తాజాగా టర్కీని కూడా టార్గెట్ చేసింది. టర్కీలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు పర్యటించాల్సి ఉంది. కానీ, ఆయన ఈ పర్యటనను విరమించుకున్నారు. ఇప్పటికే సిరియాపై టర్కీ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ దాడులు చేస్తోంది. ఈ అంశంపై టర్కీని భారత్ ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల ఐరాస సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు టర్కీకి శత్రుదేశాలైన గ్రీస్, సైప్రస్, అర్మీనియా దేశాధినేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే సిరియా వ్యవహారంలో టర్కీపై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఇప్పుడు భారత్ కూడా టర్కీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంతో ఆ దేశానికి మరిన్ని తిప్పలు తప్పవు. మొత్తంగా పాక్‌కు మద్దతుగా నిలిచిన మలేషియా, టర్కీకి భారత్ గట్టిగానే జవాబు చెబుతోంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
37 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా