newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

31-05-202031-05-2020 11:34:18 IST
Updated On 31-05-2020 14:27:47 ISTUpdated On 31-05-20202020-05-31T06:04:18.312Z31-05-2020 2020-05-31T06:03:51.300Z - 2020-05-31T08:57:47.499Z - 31-05-2020

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో లాక్‌డౌన్‌, కరోనా కట్టడి చర్యలను వివరించారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ్టితో నాలుగవ విడత లాక్ డౌన్ ముగియనుంది, జూన్ 1 నుంచి లాక్ డౌన్ ఐదవ విడత ప్రారంభం కానుంది. లాక్ డౌన్ కొనసాగింపుపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'మన్ కీ బాత్' 64వ ఎడిషన్‌లో ప్రసంగించారు.దేశ ప్రజలంతా కరోనాపై పోరాటం చేస్తున్నారు.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులను అన్వేషిస్తున్నాం.. అన్ని రంగాలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయి.. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది.  కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది.. మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిందని మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..   కరోనాపై విజయానికి మరింతగా మనం కష్టపడాలి. విద్యార్ధులకు నూతన ఆవిష్కరణలతో ఆన్ లైన్ బోధన చేస్తున్నామన్నారు.

కరోనా కట్టడి కోసం అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.  కరోనాపై పోరులో మహిళలు విశేష సేవలందించారు. మాస్కులు తయారుచేసి మహిళా సంఘాలు చేయూతనందించాయి. ఇలా అన్ని వర్గాలవారు తమ సేవానిరతిని ప్రదర్శించి మనదేశ సంస్కృతి గొప్పతనాన్ని చాటారు.

కరోనా సమయంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పేదలు, కూలీలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. వలసకూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నాం. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీన్ని యోగా ద్వారా అధిగమించవచ్చు. దీనిపై అవగాహన పెంచేందుకు ఆయుష్‌ శాఖ ‘మై లైఫ్‌-మై యోగా’ బ్లాగ్‌ను ప్రారంభించింది.నిరుపేదలకు ఆయుష్మాన్‌ భారత్‌ వరంగా మారింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి మంది చికిత్స పొందారు. ఈ కార్యక్రమం వల్ల పేదవారి సొమ్ము ఆదా అవుతోంది. అంపన్‌ పెనుతుపానుతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇటువంటి విపత్తు సమయంలో అక్కడి ప్రజలు చూపిన తెగువ, ధైర్యం ఎనలేనివి. మిడతల దండు ద్వారా ప్రభావితమైనవారందరికీ కేంద్రం అండగా నిలుస్తుంది.

భవిష్యత్తులో మనమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారా మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది కృషికి మరోమారు ధన్యవాదాలు. మేకిన్ ఇండియాకు కట్టుబడి మనం ముందుకు సాగాలి. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవాలి. ఆత్మ నిర్బర భారత్ దిశగా మనం సాగాలి. అంతర్జాతీయంగా కూడా అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం కరోనాను నియంత్రించగలుగుతున్నాం. 

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులతో ముందుకు సాగాలన్నారు. కరోనాపై అంతా పోరాటం చేస్తున్నారు. దేశంలో మిడతల దండు నష్టంపై మోడీ మాట్లాడారు. రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. రాబోయే జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది బయో డైవర్సిటీ ప్రధానాంశంగా వుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

కరోనా వైరస్ విజృంభిస్తుండడం పట్ల అంతా జాగరూకతతో వ్యవహరించాలి. వర్షకాలం మనం వాననీటిని సంరక్షించుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం నేర్చుకోవాలి. నీరు జీవనాధారం. రాబోయే తరం కోసం మనం పర్యావరణాన్ని కాపాడాలి. పక్షుల్ని రక్షించుకునేందుకు నీటిని వాటికి అందుబాటులో వుంచండి. కరోనాపై పోరాటం చేయడం అందరి బాధ్యత. మనం జాగ్రత్తగా వుండాలి. మన పక్కనున్న వారిని కూడా కాపాడుకోవాలి. వచ్చే నెలలో మరోమారు మనం మాట్లాడుకుందాం అన్నారు మోడీ. 

కరోనా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి శ్రామిక్ రైళ్ళు నడిపాం. వేసవి సందర్భంగా వివిధ ప్రమాదాల్లో వలస కార్మికులు మృత్యువాత పడడం నన్ను బాధించింది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle