newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ భారత ప్రధానా? పాక్ రాయబారా.. మమత ఫైర్

04-01-202004-01-2020 15:17:02 IST
2020-01-04T09:47:02.142Z04-01-2020 2020-01-04T09:47:00.269Z - - 15-04-2021

మోడీ భారత ప్రధానా?  పాక్ రాయబారా.. మమత ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఏఏ నిరసనల నేపథ్యంలో తరచూ పాకిస్తాన్ ప్రస్తావన తేవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ, ఇతర విపక్షాల మధ్య విమర్శలు,ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఆదినుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని మోడీపై విరుచుకుపడుతూనే వున్నారు. తాజాగా మమత ఘాటైన విమర్శలకు దిగారు. తరచూ పాకిస్తాన్ తో భారత్ ను పోల్చడం ఏంటన్నారు. 

మీరు పాక్ రాయబారా? లేక భారత ప్రధానమంత్రా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా దేశ ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావడం నిజంగా సిగ్గు చేటని ఆమె అన్నారు. గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదకు నెలవైన భారత్ ను పాక్‌తో మోడీ ఎందుకు పోలుస్తున్నారో చెప్పాలన్నారు. అన్ని సమస్యలలోకి పాక్ ను ఎందుకు లాగుతారని ఆమె ప్రశ్నించారు. 

జాతీయ జనాభా పట్టిక అమలు విషయంలో బిజెపి గందరగోళం సృష్టిస్తోందని మమత అన్నారు. సీఏఏ వ్యతిరేక ర్యాలీలో మాట్లాడిన మమత మోడీ తీరుని ఎండగట్టారు. ఎవరేం ప్రశ్నించినా, ఉద్యోగాల గురించి అడిగినా పాకిస్థాన్ వెళ్లమంటారు. పరిశ్రమలు ఏవని అడిగితే పాకిస్థాన్ వెళ్లమంటారు.పాక్ గురించి వాళ్లు మాట్లాడుకుంటారు. మనం ఇండియన్స్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయన్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నార్సీని, సీఏఏని అమలు చేయబోమన్నారు. సీఏఏ చట్టం రద్దయ్యే వరకు ఎలాంటి పోరాటలకైనా తాము సిద్ధంగా ఉంటామన్నారు. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   41 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle