newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ కోటలో పాగాకు కాంగ్రెస్ స్కెచ్

10-03-202010-03-2020 08:41:37 IST
2020-03-10T03:11:37.494Z10-03-2020 2020-03-10T03:11:27.358Z - - 12-04-2021

మోడీ కోటలో పాగాకు కాంగ్రెస్ స్కెచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీకి కంచుకోటలా వున్న గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తెగ కలలు కంటోంది. కర్ణాటకలో బీజేపీ మాదిరిగానే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాలని సిద్ధమయినట్లు కన్పిస్తుంది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ కన్నేసింది. అందుకు ప్రతిగానే గుజరాత్ ను తాము ఆధీనంలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుంది. కానీ ఆచరణలో అనుకున్నంత ఈజీ కాదు... మరో వైపు ఇదంతా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా మైండ్ గేమ్ అనే వాదన ఉంది.

దీంతో కాంగ్రెస్... ఆపరేషన్  ఆకర్ష్ కు రెడీ అంటోంది.  అదీ గుజరాత్ లో...ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగారు. ఈ ఇద్దరు ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నారు.

అలాగే కేంద్రంలోనూ అధికారంలో ఉన్నారు. మరో నాలుగేళ్ల పాటు ఈ ఇద్దరికీ దేశంలో తిరుగుండదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే కేవలం రెండేళ్లు మాత్రమే అధికారం ఉండనుంది. ఇంత తక్కువ సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురొడ్డి పోరాడింది. ఒకరకంగా రాహుల్ గాంధీ మోదీకి చెమటలు పట్టించారంటే అతిశయోక్తి కాదు.

గుజరాత్ లో రాహుల్ దూకుడును చూసి అప్పట్లో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేన కూడా శభాష్ అని పొగిడిందంటే పరిస్థితి ఎలా వుందో చెప్పాల్సిన పనిలేదు. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ 99 మాత్రమే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 91 మాత్రమే కావడంతో బతికి బయటపడ గలిగింది. కాంగ్రెస్ కు 77 స్థానాలు దక్కించుకుని గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు.

గుజరాత్ అసెంబ్లీ పరిసరాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు కాంగ్రెస్ నేత గాలెం వేసేందుకు ప్రయత్నించారు. నితిన్ పటేల్ సహా 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరితే సీఎం పోస్టు ఇస్తామని పేర్కొన్నారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణ బయటకు పొక్కడంతో అసెంబ్లీ లాబీల్లో చర్చకు దారితీసింది. లాతీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్‌జీ తుమార్నే.. నితిన్ పటేల్‌తో సంప్రదింపులు జరిపారు.

తమ పార్టీలోకి వస్తే అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇది బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలను తీసుకొచ్చిందని కమలదళ నేతలు అంటున్నారు. ఇదేమీ కాదని.. విశ్వ ఉమియా ధామ్ కార్యక్రమంలో నితిన్ పటేల్ చేసిన ప్రకటనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తీసుకొచ్చిందని హస్తం నేతలు చెప్తున్నారు.

రాజ్యసభ ఎన్నికలకు ముందు.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వ్యుహాలు అమలు చేస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎంపైనే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు దింపేందుకు ప్రయత్నించడం ఆసక్తి కలిగిస్తోంది. దీనిపై గుజరాత్ బీజేపీ చీఫ్ స్పందిస్తూ.. నితిన్ పటేల్‌ను లక్ష్యగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని పేర్కొన్నారు. 

మరో వైపు మధ్యప్రదేశ్ లో తమపై ప్రయోగిస్తున్న ఆకర్ష్ అస్త్రాన్ని కాంగ్రెస్ ఇక్కడ ఉపయోగించదలచుకున్నట్లుంది. గుజరాత్ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకువస్తే సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకటించడం చర్చనీయాంశమైంది.

అయితే ఇరవై మంది ఎమ్మెల్యేలను ఆకర్షించే శక్తి లేక కాంగ్రెస్ ఆ పనిని బీజేపీ నేతకే అప్పగించందన్న సెటైర్లు కూడా వినపడుతున్నాయి. అయితే కేవలం రెండేళ్లు మాత్రమే అధికారం ఉన్న గుజరాత్ లో జంప్ లు ఉండవని కాంగ్రెస్ నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ వారు చీలిపోకుండా ఉండేందుకే ఇలా కాంగ్రెస్ డ్రామాకు తెరతీసిందనే వారు కూడా లేకపోలేదు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle