newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ అసోం టూర్ రద్దు.. ఎందుకంటే.?

09-01-202009-01-2020 08:30:08 IST
Updated On 09-01-2020 09:34:54 ISTUpdated On 09-01-20202020-01-09T03:00:08.499Z09-01-2020 2020-01-09T02:57:26.747Z - 2020-01-09T04:04:54.784Z - 09-01-2020

మోడీ అసోం టూర్ రద్దు.. ఎందుకంటే.?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధాని మోడీ నిత్యం పర్యటనలతో బిజీగా వుంటారు. విదేశాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రధాని పర్యటిస్తుంటారు. తాజాగా ఆయన అసోంలో పర్యటించాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల ఈ టూర్ రద్దయింది. అసోం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే వున్నాయి. ఈ నిరసనల హోరు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉండడంతో అధికారులు ఆయన పర్యటన రద్దుచేసుకోవాలని సూచించారు. 

జనవరి 10న శుక్రవారం గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావాల్సి ఉంది.సీఏఏ ఆందోళన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా  ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మాత్రం తమకు అందినట్లు ఖేలో ఇండియా గేమ్స్ సీఈఓ అవినాష్ జోషి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరైతే పర్యటనను అడ్డకుంటామని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఆల్ ఆస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌ 15 నుంచి 17 వరకు భారత్ జపాన్ దేశాల మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరసనల కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అసోంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో జపాన్ ప్రధాని షింజో అబే తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడంతో ఆ నిరసనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టగానే అసోం రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. వివిధ హింసాత్మక ఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ గేమ్స్ జనవరి 10 నుంచి జనవరి 22వరకు జరగాల్సి వుంది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle