newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల విజృంభణ.. 7,80,054 పాజిటివ్ కేసులు... 21, 417 మరణాలు *ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్... యూపీ పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో దూబే హ‌తం*గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అప్రమ‌త్త‌మైన వ్యాపార వర్గాలు.. వ్యాపార కార్యకలాపాల సమయం కుదింపు*శ్రీకాకుళం: నేటి నుంచి రాజాంలో లాక్ డౌన్.. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతి*నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జ‌యిని అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు బంద్‌... సోమ‌వారం వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న*ఢిల్లీ: వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ‌ బ్యాంకాక్‌, లండ‌న్, ఉక్రెయిన్, వియ‌త్నాం నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించ‌నున్న ఎయిరిండియా*తెలంగాణాలో గ‌త 24 గంట‌ల్లో 1,410 పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 331 మంది మృతి..హైదరాబాద్ లో 918 కేసులు..యాక్టివ్ కేసులు 12,423, డిశ్చార్జ్ అయిన కేసులు 18,192*రఘురామకృష్ణం రాజు మీద తణుకు ఎమ్మెల్యే ఫిర్యాదు..తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ మాట్లాడారని, జంతువులతో పోల్చారని ఫిర్యాదు చేసిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు*మాజీ మంత్రి రామస్వామి మృతి..సంతాపం వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ*ఈ నెల 25 లోపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని డీఈఓ లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం*తెలంగాణా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు*ఏపీలో గడచిన 24 గంటల్లో 16,882 మంది నమూనాలు పరీక్షించగా 1,555 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ

మోడీ, అమిత్ షా ఈసీ కోడ్‌కు అతీతులా? కాంగ్రెస్ ఫైర్

30-04-201930-04-2019 09:06:59 IST
Updated On 03-07-2019 11:27:11 ISTUpdated On 03-07-20192019-04-30T03:36:59.530Z30-04-2019 2019-04-30T03:36:29.467Z - 2019-07-03T05:57:11.713Z - 03-07-2019

మోడీ, అమిత్ షా ఈసీ కోడ్‌కు అతీతులా? కాంగ్రెస్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నేతలు కోడ్ గీత దాటితే కొరడా ఝుళిపిస్తోంది. అయితే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా పట్టించుకోరా? వారు చట్టానికి అతీతులా అని కాంగ్రెస్ మండిపడుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై చేసిన ఫిర్యాదులకు ఎన్నికల కమిషన్ వైపు నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సైన్యం విషయాలను ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ఇది ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపిస్తోంది. 

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ సైన్యాన్ని పదేపదే రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకుంటోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఎన్నికల కమిషన్ ఒక స్పష్టమైన సూచన చేసింది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో రాజకీయ పార్టీలేవి తమ ప్రచారాల్లో మిలటరీ విషయాలను ప్రస్తావించవద్దని సూచించింది.

కానీ మోదీ, అమిత్ షా మాత్రం ఎన్నికల ప్రచారంలో పదే పదే మిలటరీ విషయాలనే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలకు కోడ్ వర్తించదా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మను అభిషేక సింఘ్వీ ప్రశ్నించారు. మాయావతి, యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు, కేసీఆర్ లాంటి నేతల ప్రసంగాలపై నిఘా పెట్టిన ఈసీ మోడీ, షాలను ఎందుకు వదిలేస్తోందని కాంగ్రెస్ ప్రశ్నించింది. 

కాంగ్రెస్ హయాంలో ముంబై నగరంపై 26/11 దాడులు జరగ్గా.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్నారు. పాక్ చర్యలను తిప్పికొట్టలేని కాంగ్రెస్ అసమర్థత వల్లనే భారత్‌లో ఉగ్రదాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక.. పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడటానికి భయపడుతోందని చెబుతున్నారు. ఇవన్నీ ఈసీ ఎందుకు పట్టించుకోవడంలేదు, దీనిపై న్యాయపోరాటానికి తాము సిద్ధమవుతున్నాయని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో రాజకీయం రసకందాయంలో పడనుంది. 

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

   an hour ago


 ‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

   an hour ago


బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

   an hour ago


అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

   an hour ago


సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

   13 hours ago


మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

   14 hours ago


కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

   14 hours ago


ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

   20 hours ago


వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

   a day ago


కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle