newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ. అమిత్ షాలపై ఛత్తీస్ ఘడ్ సీఎం హాట్ కామెంట్స్

25-01-202025-01-2020 08:43:13 IST
Updated On 25-01-2020 13:20:09 ISTUpdated On 25-01-20202020-01-25T03:13:13.402Z25-01-2020 2020-01-25T03:12:24.610Z - 2020-01-25T07:50:09.619Z - 25-01-2020

మోడీ. అమిత్ షాలపై ఛత్తీస్ ఘడ్ సీఎం హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ ఆర్సీలపై రగడ జరుగుతూనే వుంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు తమదైన రీతిలో కేంద్రంపై వ్యూహాత్మక యుద్ధం చేస్తూనే వున్నారు. వీరికి తోడయ్యారు మరో రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్.  జర్మన్‌ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను పోల్చేశారు ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పోల్చారు. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా హెచ్చరించడంపై మండిపడ్డారు. 

హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఛత్తీస్‌ఘడ్ సీఎం హిస్టరీని ఉటంకించారు. అడాల్ఫ్ హిట్లర్ సైతం తనను ఎవరేమన్నా పర్వాలేదని, జర్మనీని మాత్రం అనడానికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారని, 'మోటా భాయ్, ఛోటా భాయ్' సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. ఈవ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పౌర రిజిస్టర్‌ అమలు చేయబోమన్నారు.

వివిధ చట్టాల విషయంలో ప్రధాని, హోంమంత్రి మధ్య సమన్వయం లేదన్నారు.మోదీ-షా మధ్య విభేదాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య అంతర్గత సంఘర్షణతో దేశ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై ఇద్దరూ విరుద్ధ ప్రకటన చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తే మాత్రం వ్యతిరేకంగా సంతకం చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని బఘేల్‌ అన్నారు. ఎన్‌ఆర్‌సీ అమలు చేయడం వల్ల భూముల్లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే తాను దీనికి వ్యతిరేకం అంటున్నారు. ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తేలేదని మోదీ ప్రకటిస్తే.. అమలు చేసి తీరుతామని అమిత్‌ షా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇద్దరిలో ఎవరి మాట నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాయ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మోదీ నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే, రెండోసారి అధికారంలోకి వచ్చాక  అమిత్‌ షా నేతృత్వంలో ఆర్టికల్‌ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి వివాదాస్పద చట్టాలు తీసుకువచ్చారని ఈనిర్ణయాలన్నీ దేశప్రజలను ఇబ్బందిపెడుతున్నాయన్నారు. ఛత్తీస్ ఘడ్ సీఎం తాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle