మోడీపై రాహుల్ ఫైర్.. తాజ్‌మహల్‌నే అమ్మేస్తారని ఎద్దేవా
05-02-202005-02-2020 08:45:10 IST
Updated On 05-02-2020 12:29:16 ISTUpdated On 05-02-20202020-02-05T03:15:10.624Z05-02-2020 2020-02-05T03:15:07.965Z - 2020-02-05T06:59:16.873Z - 05-02-2020

ఢిల్లీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ఇటు ఆప్, అటు బీజేపీ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో విమర్శలకు పదునుపెడుతున్నారు. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. మోడీ కేజ్రీవాల్ పై విమర్శలు చేస్తుంటే.. రాహుల్ మోడీని తూర్పారబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మోదీ దేశంలోని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పరం చేస్తున్నారని, ఏదో ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్‌ను కూడా అమ్మేసినా ఆశ్చర్యం లేదన్నారు. ఢిల్లీలోని జంగ్‌పురాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు మేక్ ఇన్ ఇండియా అనే మంచి నినాదాన్ని తీసుకొచ్చిన మోదీ ఆగ్రాలో కనీసం ఒక్క ఫ్యాక్టరీని కూడా ఎందుకు నిర్మించలేదని విమర్శించారు. దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండాగా మారిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, యువత నిరాశ, నిస్పృహలో వున్నారని మోదీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని, దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యందని విమర్శలు చేశారు. ఢిల్లీలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏం చేశారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగడంతో యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. జంగ్‌పురా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తార్విందర్ సింగ్ మార్వాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరోవైపు గురువారంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఈ రెండురోజుల్లో ఢిల్లీలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహించనుంది.

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
11 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
17 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
12 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
14 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
20 hours ago
ఇంకా