newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీపై నామినేషన్ ఎఫెక్ట్ : మాజీ జవాన్‌పై కేసులు

04-05-201904-05-2019 08:30:59 IST
Updated On 02-07-2019 11:49:04 ISTUpdated On 02-07-20192019-05-04T03:00:59.984Z04-05-2019 2019-05-04T03:00:33.585Z - 2019-07-02T06:19:04.589Z - 02-07-2019

మోడీపై నామినేషన్ ఎఫెక్ట్ : మాజీ జవాన్‌పై కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వారణాశిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సిద్ధమై నామినేషన్  వేసిన మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. తేజ్ బహదూర్ యాదవ్ పై కేసులు కూడా నమోదు చేశారు. తేజ్ బహదూర్ యాదవ్ ఈ పేరు కొంత కాలం క్రితం మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగింది.

బీఎస్ఎఫ్‌లో అధికారుల అవినీతిపై ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. జవాన్ల ఆహారం కోసం ప్రభుత్వం ఇచ్చే సరుకులను అధికారులు అమ్ముకొని జవాన్లకు సరైన తిండి కూడా పెట్టడం లేదని రుజువులతో సహా ఆయన పోస్ట్ చేసిన వీడియో దేశం మొత్తం చర్చకు కారణమయ్యింది.

ఆ తర్వాత కొంత కాలం తేజ్ బహదూర్ యాదవ్ మాయమయ్యారు . ఆయనను చంపేస్తారేమో అని ఆయన భార్య ఆందోళన వ్యక్తం కూడా చేసింది. అనంతరం తేజ్ బహదూర్ యాదవ్ ను ఉద్యోగం నుండి తీసివేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఆయన నరేంద్ర మోడీపై పోటీకి సిద్దపడ్డారు. వార‌ణాసిలో ఇండిపెండెంట్ గా ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేశారు. తర్వాతే అసలు సీన్ ప్రారంభమయింది. సమాజ్ వాదీ పార్టీ ముందుగా తాను ప్రకటించిన అభ్యర్థిని మార్చి తేజ్ బహదూర్ కు తమ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఏప్రెల్ 29 న మళ్ళీ నామినేషన్ దాఖలు చేశాడు.

ఇది దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అనంతరం బీఎస్ ఎఫ్ నుండి తొలగించడాన్ని తేజ్ బహదూర్ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని చెబుతూ ఎన్నికల కమీషన్ ఆయన నామినేషన్ ను తిరస్కరించింది. దానిని ఆయన తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తేజ్ బహదూర్ పై 147, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించాడని, ప్రజలని రెచ్చగొట్టి అల్లర్లు ప్రేరేపించాడని అధికారగణం ఆరోపిస్తోంది. మొత్తం మీద ఇటు నిజామాబాద్ పసుపు రైతులు, తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ వారణాశిలో చర్చకు దారితీశాయి.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   20 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   19 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   18 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle