మోడీకి మమత సవాల్.. దమ్ముంటే కూల్చండి
17-12-201917-12-2019 08:37:29 IST
Updated On 17-12-2019 12:07:26 ISTUpdated On 17-12-20192019-12-17T03:07:29.253Z17-12-2019 2019-12-17T03:07:18.350Z - 2019-12-17T06:37:26.190Z - 17-12-2019

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే వున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆమె ఓ భారీ నిరసన ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. గుండెలాంటి కోల్కతా నుంచి జరిగిన నిరసన ప్రదర్శనలో ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, వీరి చట్టాలన్నీ బెంగాల్లో తాను శవమయ్యాకే అమలవుతాయని' అన్నారు. ర్యాలీలో వందల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఆమెతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎన్నార్సీ, సీఏఏను రాష్ట్రంలో అమలు చేయబోనన్నారు. తనను జైల్లో పెట్టినా సరే కేంద్రానికి లొంగేది లేదు. నల్ల చట్టాలను ఎప్పటికీ అమలు చేయనివ్వను. చట్టాలను రద్దు చేసేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగిస్తా' అని చెప్పారు. ఇతరులకు సలహా ఇచ్చే ముందు ఈశాన్యంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితిని కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మమతా బెనర్జీ ఒంటరి అని వారు అనుకుంటున్నారని, కానీ మీరంతా తన వెంట ఉన్నారని, మన పోరాటం సరైనదైతే ప్రజలంతా వెంట వస్తారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన ఉధృతం అవుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని మమత ఖండించారు. ఎన్నార్సీపై గళమెత్తినప్పుడు ఒంటరిగా ఉన్నామని, ఇప్పుడు ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, కేరళ వంటి ఇతర రాష్ర్టాల సీఎంలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మమత చెప్పారు. మమతా బెనర్జీ తీరుపై రాష్ట్ర గవర్నర్ మండిపడుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నిరసన ర్యాలీకి నేతృత్వం వహించడంపై రాష్ట్ర గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాష్టంలో ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి.. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ జగ్దీప్ దంకర్ ఆరోపించారు. తమది మతపరమయిన పోరాటం కాదన్నారు మమత. మొత్తం మీద మమత ధిక్కార స్వరం మోడీ సర్కార్ కి సవాల్ గా మారింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
10 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
13 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
11 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
14 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
8 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా