newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీకి చెమటలు పట్టిస్తున్న ‘ఆ ముగ్గురు’

16-05-201916-05-2019 08:54:15 IST
Updated On 27-06-2019 17:35:31 ISTUpdated On 27-06-20192019-05-16T03:24:15.516Z16-05-2019 2019-05-16T03:24:00.784Z - 2019-06-27T12:05:31.188Z - 27-06-2019

మోడీకి చెమటలు పట్టిస్తున్న ‘ఆ ముగ్గురు’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధాని నరేంద్రమోడీపై ముగ్గురు మహిళలు విరుచుకుపడుతున్నారు. తమ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వారే మమత, మాయావతి, ప్రియాంకా గాంధీ. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలన హింసాత్మకంగా కొనసాగిందని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు. తనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో యూపీలో దాడులు జరిగాయని మోదీ నిరూపిస్తారా అని ప్రశ్నించారు. గుజరాత్‌ లో మోదీ సీఎంగా మొదలుకొని, ప్రధాని పాలన వరకు అన్నీ దాడులే జరిగాయని చెప్పారు. తనపై మోదీ చేస్తోన్న విమర్శలను సామాజిక ఉద్యమకారులు ఖండించాలని సూచించారు. అవినీతిపరులైన నేతలంగా బీజేపీలోనే ఉన్నారని మాయావతి స్పష్టం చేశారు.

మరోవైపు రాహుల్ సోదరి, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ప్రధాని మోదీ ప్రచారంలో ముందుంటారు, పనిలో వెనుకంజలో ఉంటారని ఎద్దేవా చేశారు ప్రియాంకా గాంధీ. వారణాసిని దేశానికి మార్గదర్శకంగా నిలిపానని మోదీ అన్న మాటలు పచ్చి అబద్ధాలని అన్నారు.

వారణాసిలో సరియైన రవాణా వ్యవస్థ ఇప్పటివరకు లేదని అన్నారు. ప్రధాని మోదీ గత ఐదేళ్లలో వారణాసికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించాలని ఆమె సవాల్ చేశారు. అభివృద్ధి అంటే అమేథిలో చూడండని మోదీకి చురకలంటించారు ప్రియాంక. వారణాసి బాగుపడాలంటే స్థానికుడినే ఎన్నుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి శర్మకే ఓటేయాలని ప్రజలను ఆమె కోరారు.

ఇటు మమతా బెనర్జీ మాటల తూటాలు పేలుస్తున్నారు. కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీ ఉద్రిక్తతల్ని మరింతగా పెంచింది. బీజేపీ - తృణమూల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శల ఫిరంగి పేల్చారు. అయితే, మోదీకి ఘాటుగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ.

బెంగాల్లో ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగించడాన్ని మమత ఖండించారు. బీజేపీ ‘జై శ్రీరామ్‌’ నినాదాలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ ఎన్నికల సభల్లో ఎక్కువగా దుర్గా దేవీ గురించి, దుర్గా పూజ గురించి ప్రస్తావిస్తున్నారు. బీజేపీ జాతీయవాదం, మమతా బెంగాల్‌వాదం విజయం సాధిస్తుందో చూడాలి.  బెంగాల్లో బీజేపీ బలం పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ మోడీని టార్గెట్ చేస్తున్నారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle