newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

మోడీకి ఎదురుగాలి.. 180 సీట్లు లెక్క తేల్చిన సర్వే

12-05-201912-05-2019 09:48:03 IST
Updated On 28-06-2019 13:25:44 ISTUpdated On 28-06-20192019-05-12T04:18:03.259Z12-05-2019 2019-05-12T03:56:07.677Z - 2019-06-28T07:55:44.545Z - 28-06-2019

మోడీకి ఎదురుగాలి.. 180 సీట్లు లెక్క తేల్చిన సర్వే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణం ఈడ్చి తన్నేలా ఉంది. ఉత్తరం ఉసూరుమనిపిస్తోంది.. దీంతో మోడీ తలపట్టుకుంటున్నారు. 17వ లోక్‌స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు దాదాపు చివ‌రి అంకానికి చేరుకోవడంతో బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈనేపథ్యంలో ఆరో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. ఈ నెల 19న చివ‌రిద‌శ అయిన ఏడో ద‌శ‌ పోలింగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత 23న ఎన్నిక‌ల కౌంటింగ్ ఉంటుంది.

ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ స్వత‌హాగా 310 సీట్లు సాధిస్తామ‌ని చెబుతున్నప్పటికీ.. ఈ స‌ర్వే ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతుంద‌నేది ఆ పార్టీ నేతలే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో 5 సీట్లు సాధిస్తామ‌ని బీజేపీ నాయకుల స‌ర్వే చెబుతోంది. తెలంగాణ‌లో 1 లేదా 2 సీట్లు తెచ్చుకోవ‌డ‌మే ఆ పార్టీకి గ‌గ‌నం. మ‌రి 5 సీట్లు వ‌స్తాయ‌ని అంత‌ర్గత స‌ర్వేలో ఏ ప్రాతిప‌దిక‌న వేసుకున్నార‌నేది తేలాల్చి ఉంది.

అలాగే తాజాగా ఆర్‌.ఎస్‌.ఎస్ చేసిన స‌ర్వేలో బీజేపీకి 180 సీట్లు వరకూ వస్తాయని తేలింది. ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కులు చాలా రాష్ట్రాల్లో ఇంటింటి స‌ర్వే చేప‌ట్టారు. దీని ప్రకారం బీజేపీకి కేవ‌లం 180 సీట్లు మాత్రమే వ‌స్తాయని, మ‌రో 100 సీట్ల వ‌ర‌కు మిత్రుల స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌ని సూచించారు. ఆర్‌.ఎస్.ఎస్ చేసిన హెచ్చరిక‌లు ఇప్పుడు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బీజేపీ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఆర్‌.ఎస్‌.ఎస్ చెప్పిన‌ట్టు 180 సీట్లకే ప‌రిమ‌తం అయితే అనుస‌రించాల్సిన వ్యూహాల‌కు ఇప్పటి నుంచే ప‌దును పెడుతున్నారు. పాతమిత్రులను మళ్ళీ కలిసే పనిలో ఉన్నారు. ఈ ఐదేళ్ళలో దూరమయిన మిత్రపక్షాలను మళ్ళీ బతిమాలి, బామాలి తమ దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. 

2014లో క‌నిపించినంత మోడీ హవా ఇప్పుడేమీ లేదన్నది నిజం  గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగా బీజేపీ అధికారం సాధించింది. ఎన్నో అంచ‌నాల‌తో ప్రధాని ప‌గ్గాలు చేప‌ట్టిన మోడీ.. ఈ ఐదేళ్లలో సాధించిన ఘ‌న‌త‌లు పెద్దగా లేవ‌ని చెప్పాలి. అంత‌ర్జాతీయంగా దౌత్యప‌ర‌మైన సంబంధాలు మెరుగుప‌ర‌చ‌డం, ఉత్తర‌భార‌తంలో విద్యుత్తు, గ్యాస్ సిలిండ‌ర్ల స‌దుపాయం మిన‌హా చెప్పుకోద‌గ్గ విజ‌యాల్లేవు.

పైగా జీఎస్‌టీ, పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశ ఆర్థిక వ్యవ‌స్థ తిరోగ‌మ‌నం బాట ప‌ట్టింది. ఈ ద‌శ‌లో ఎన్నిక‌లు అత్యంత కీలకంగా మారాయి. మోడీ వ్యతిరేకంగా బ‌ద్ధ విరోధులే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవి పోరాడుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న యూపీలో బీజేపీ చావుదెబ్బ తినడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఉత్తర‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ క‌ల‌సిపోటీ చేస్తున్నాయి. జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్‌కు టీడీపీ మ‌ద్దతు ఇస్తోంది. దాదాపు 21 పార్టీల‌ను లౌకిక వేదిక‌పైకి తీసుకువ‌చ్చేందుకు చంద్రబాబు సన్నాహాలు చేయడం బీజేపీ నేతలకు రుచించడంలేదు. 

ఇప్పటికే బీజేపీ ప‌క్షాన అకాలీద‌ళ్‌, అప్నాద‌ళ్‌, లోక్‌జ‌న‌శ‌క్తి, జేడీయూ, అన్నాడీఎంకే, శివ‌సేన త‌దిత‌ర పార్టీలు మ‌ద్దతుగా ఉన్నాయి. ఇక సీట్లు త‌క్కువైతే తెలుగు రాష్ట్రాల‌పై ఫోక‌స్ చేయాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. టీఆర్ఎస్, వైసీపీల మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకోవాల‌ని ప్రయ‌త్నిస్తోంది. ఇప్పటికే ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే మ‌ద్దతు ఇవ్వాల‌ని ఈ రెండు పార్టీల‌తో బీజేపీ అగ్రనాయ‌కులు చ‌ర్చలు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఒడిశాలోని బిజూ జ‌న‌తాద‌ళ్‌ను త‌మ‌వైపునకు తిప్పుకోవాల‌ని బీజేపీ ధర్మేంద్రప్రధాన్ ద్వారా ప్రయత్నిస్తోంది. 

ఇటీవ‌ల ఫ‌ణి తుపాను స‌మ‌యంలో ఒడిశాకు ఏకంగా వేయి కోట్ల సాయాన్ని ప్రక‌టించి, ఆ రాష్ట్ర సీఎం న‌వీన్‌పై ప్రధాని మోడీ అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. గ‌తంలో కేర‌ళ‌కు తుపాను వ‌చ్చిన‌ప్పుడు కేవ‌లం 500 కోట్ల సాయం మాత్రమే ప్రక‌టించ‌గా.. ఇప్పుడు ఏకంగా ఒడిశాకు వెయ్యికోట్లు ప్రక‌టించి బిజూ జ‌న‌తాద‌ళ్‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ విధంగా నవీన్ పట్నాయక్ తమకు దగ్గరవుతారని మోడీ అండ్ కో భావిస్తోంది. 

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   10 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   11 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   11 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle