newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మే23 రాహుల్‌కి అగ్నిపరీక్షే

15-05-201915-05-2019 07:33:05 IST
Updated On 28-06-2019 11:56:34 ISTUpdated On 28-06-20192019-05-15T02:03:05.008Z15-05-2019 2019-05-15T02:02:59.610Z - 2019-06-28T06:26:34.752Z - 28-06-2019

మే23 రాహుల్‌కి అగ్నిపరీక్షే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి పెను స‌వాల్ అయ్యాయ‌ట‌. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా అధికారం ద‌క్కించుకోవాల‌న్న‌ప‌ట్టుద‌ల కంటే, మోడీని ప్ర‌ధాని కాకుండా చేయాల‌న్న త‌ప‌నే ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ట‌. ఇప్ప‌టి దాకా ఆరు ద‌శ‌ల పోలింగ్ పూర్తిఅయింది. ఫ‌లితాల త‌ర్వాత ఏం చేయాల‌న్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తోంద‌ట‌. మోడీ, బీజేపీ లక్ష్యంగా మహాకూటమితో వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ చిక్కువ‌చ్చి ప‌డింద‌ట‌. 

కూటమిలోని ఇతర పార్టీలకు మెజార్టీ స్థానాలు వచ్చి, సొంతంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోతే, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకే తేవ‌డం క‌ష్టం. ఇదే జ‌రిగితే ఏం చేయాల‌న్న దానిపై టెన్ జ‌న్ ప‌థ్ తీవ్రంగా ఆలోచిస్తోంద‌ట‌. ఎందుకంటే మ‌హాకూట‌మిలో ఉంటామ‌ని చెబుతున్న కొన్ని పార్టీలు కీల‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి పోటీ చేయ‌డం లేదు. ప‌శ్చిమ బెంగాల్లో మ‌మ‌త బెన‌ర్జీ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఎన్నిక‌ల వేళ దూరం పెట్టేసింది. అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు పొస‌గ‌లేదు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. అక్క‌డ పొత్తు పెట్టుకుని బ‌రిలో దిగిన స‌మాజ్ వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో నేరుగా త‌ల‌ప‌డుతున్నాయి. ఇక ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి. ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న‌ది ఇక్క‌డ వేరే లెక్క. ఈ స‌మీక‌ర‌ణాలు అన్ని చూసిన కాంగ్రెస్ పెద్ద‌లు, త‌మ పార్టీకి సొంతంగా ఎక్కువ సీట్లు రాక‌పోతే, రాహుల్ గాంధీని ప్ర‌ధాని రేసు నుంచి త‌ప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయ‌ట‌. 

ఎందుకంటే గ‌తంలో కూడా ఇదే ఎత్తుగ‌డ వేసింది కాంగ్రెస్ పార్టీ. 1989 ఎన్నిక‌ల్లో 197 సీట్లు గెలిచినా ప్ర‌ధాని పీఠం అందుకోలేక పోయింది కాంగ్రెస్ పార్టీ. వీపీ సింగ్ ప్ర‌భుత్వం ప‌డిపోయిన త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చింది.

ఇదంతా చూస్తే ఓ విష‌యం అర్ధం అవుతోంది. రాహుల్ ప్ర‌ధాని కావాలంటే కాంగ్రెస్ పార్టీకి 272 సీట్లు వ‌చ్చి తీరాలి. అలా కాక‌పోతే బ‌య‌ట నుంచి వేరొక‌రికి మ‌ద్దతు ఇచ్చి, వారిని ప్ర‌ధానిని చేయాలి. ఒక‌వేళ 100 సీట్లకు పైగా వ‌చ్చినా కూడా రాహుల్ ప్ర‌ధాని అవ్వ‌డం క‌ష్టం. 

ఒక‌వేళ ప్ర‌ధాని అయినా ఐదేళ్లు కొన‌సాగుతార‌న్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ఆ కూట‌మిలో ఉన్న మిత్ర‌ప‌క్షాలు ఎలా మార‌తాయో తెలీదు. ఒక‌వేళ వారు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తే, ఐదేళ్ల పాటు ప్ర‌ధానిగా ఉండ‌లేక పోయార‌న్న అవ‌మానం మూట‌గ‌ట్టుకోవాలి. ఆ ప‌రిస్థితి తెచ్చుకోడానికి కాంగ్రెస్ పెద్ద‌లు సిద్ధంగా లేర‌ట‌.

ఆ పార్టీ చ‌రిత్ర కూడా అదే చెబుతోంది. పూర్తి మెజార్టీ ఉన్న‌ప్పుడే జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్ర‌ధాన మంత్రులు అయ్యారు. పూర్తి మెజార్టీ లేన‌ప్పుడు ఒక‌సారి పీ.వీ. న‌రసింహారావు, మ‌రోసారి మ‌న్మోహ‌న్ సింగ్ ల‌ను ప్ర‌ధానిగా ముందుకు తెచ్చారు. 

ఇది వారి మీద ప్రేమ అనేకంటే, తాము ఇబ్బంది ప‌డ‌టం ఇష్టం లేక‌పోవ‌డ‌మే అన్న‌ది వాస్త‌వం. ఓవైపు మ‌రోసారి న‌రేంద్ర మోడీ ఎన్డీయే నాయ‌క‌త్వంలో ప్ర‌ధాని అవ్వ‌డం ఖాయ‌మ‌న్న జాతీయ సర్వేల‌తో, ఇబ్బంది ప‌డుతున్న కాంగ్రెస్, ఎన్డీయేకు త‌క్కువ సీట్లు ప్రాంతీయ పార్టీలు ఆవైపు పోకుండా ఇప్ప‌టి నుంచే లాబీయింగ్ మొద‌లు పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు చిదంబ‌రం, ఏ.కే. ఆంటోని, గులాం న‌బీ ఆజాద్ త‌దిత‌రులు అదే ప‌నిలో ఉన్న‌ట్లు ఢిల్లీలో ప్ర‌చారం జరుగుతోంది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle