newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మే 31 వరకూ లాక్ డౌన్ 4.O

17-05-202017-05-2020 18:18:21 IST
Updated On 17-05-2020 18:31:42 ISTUpdated On 17-05-20202020-05-17T12:48:21.144Z17-05-2020 2020-05-17T12:48:09.917Z - 2020-05-17T13:01:42.758Z - 17-05-2020

మే 31 వరకూ లాక్ డౌన్ 4.O
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు జెట్ స్పీడుతో పోటీపడుతున్నాయి. రోజురోజుకీ వేలాదికేసుల వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.  ఈనేపథ్యంలో లాక్ డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి.

వివిధ రాష్ట్రాలలో రెడ్ జోన్లు మినహా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని అంతా  భావిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించే లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ మూడో దశ నేటితో ముగిసింది. 

లాక్ డౌన్ పొడిగిస్తారని న్యూస్ స్టింగ్ ముందే చెప్పింది. కొన్ని సడలింపులతో లాక్ డౌన్ 4.O

కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాలకు మరిన్ని సడలింపులను ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. జోన్లు, హాట్‌స్పాట్ల నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేయనుంది. ఆర్థికంగా వెసులుబాట్లు వుండాలని, ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రిని కోరాయి. దానికి అనుగుణంగా కేంద్రం కొన్ని మినహాయింపులకు మొగ్గుచూపింది. 

ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.

లాక్‌డౌన్‌ 4.0: ఆంక్షలు, సడలింపులు ఇవీ!

లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా ఈసారి కొన్ని మినహాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. మెట్రో, లోకల్‌ రైళ్లు, దేశీయ విమాన  ప్రయాణాలకు అనుమతి లభించనుంది. రాష్ట్రాలకు జోన్ల నిర్ణయాధికారం ఇచ్చారు. రెడ్‌ జోన్లలోనూ సడలింపులు కొన్ని వుండనున్నాయి. లాక్‌డౌన్‌ 4.0లో సడలింపులు, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా ఆరంభమవుతాయని తెలుస్తోంది. కరోనా హాట్‌స్పాట్లను నిర్ణయించే అధికారాన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

దేశంలో ఎక్కడా కళాశాలలు, పాఠశాలలు, మాల్స్‌, సినిమా థియేటర్లకు అనుమతి ఉండదు. కొవిడ్‌-19 కంటెయిన్‌మెంట్‌ జోన్లను మినహాయించి రెడ్‌జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు, కళ్లద్దాల దుకాణాలకు అనుమతినిస్తారు. గ్రీన్‌ జోన్లలో పూర్తి కార్యకలాపాల్ని ఆరంభించొచ్చు. ఆరెంజ్‌ జోన్లలో మాత్రం పరిమిత ఆంక్షలు ఉంటాయి. రెడ్‌జోన్‌, కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు కొనసాగుతాయి.  రెడ్‌ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారాలు సైతం రాష్ట్రాలకే ఇస్తారు. అత్యవసరం కాని వస్తువులు విక్రయించే దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి విధానం అమలు చేయొచ్చని అంటున్నారు. ఈ-కామర్స్‌ సంస్థలు డెలివరీ చేసేందుకు పర్మిషన్ ఇవ్వచ్చును.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   12 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle