మేమేం ఆశపడడం లేదు..‘మహా’సర్కార్ పై శరద్ పవార్
06-11-201906-11-2019 15:54:48 IST
2019-11-06T10:24:48.970Z06-11-2019 2019-11-06T10:24:41.646Z - - 15-04-2021

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడైనా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే వుంది. ఒకవైపు బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటులో ఎవరి పంతాలకు వారు పోతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన మంతనాలు జరుపుతోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కీలక అంశాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నోరు విప్పారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలనుకోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ప్రభుత్వ ఏర్పాటులో మేం భాగం కాదలుచుకోలేదు' అన్నారు శరద్ పవార్. అంతేకాదు శరద్ పవార్ మరో అడుగు ముందుకేసి మరీ అమిత్ షాకు సవాల్ విసిరారు. మహారాష్ట్రలో అమిత్ షా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తా చాటుకోవాలని పవార్ కోరారు. శివసేనతో తాము పొత్తు పెట్టుకోబోమని,ఆ పార్టీతో పొత్తు శ్రేయస్కరం కాదన్నారు. బీజేపీకి ఎటువంటి సంఖ్యా బలం లేని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అమిత్ షా తన రాజకీయ పలుకుబడిని ప్రదర్శించారని, ఇప్పుడు మహారాష్ట్ర విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందన్నారు. అసెంబ్లీ ఫలితాలు వెలుబడి రెండు వారాలు పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటు అంకం ఇంకా పూర్తికాలేదు. సీఎం పీఠం కోసం శివసేన పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇస్తోంది. కర్నాటకలో కుమారస్వామి తరహాలో శివసేన వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. బీజేపీ-శివసేన కూటమి ఎన్నికల్లో ఎక్కువసీట్లు సాధించినా ఆ రెండు పార్టీల మధ్య విబేధాలు రావడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఇప్పటికే శివసేనకు చెందిన సంజయ్ రౌత్.. రెండుసార్లు పవార్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో మహారాష్ట్రలో బీజేపీ లేకుండా శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ మైత్రితో అధికారం చేపట్టవచ్చని అంటున్నారు. అయితే తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్ మరోసారి స్పష్టం చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నా రూటే సెపరేటు
a minute ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago
ఇంకా