మేం లేకపోతే మీరెక్కడ? కేంద్రంపై కేటీయార్ నారాజ్...
14-02-202014-02-2020 18:39:56 IST
2020-02-14T13:09:56.299Z14-02-2020 2020-02-14T13:09:54.155Z - - 12-04-2021

తెలంగాణకు భారత ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన తనను తీవ్రంగా బాధించిందని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో భారతప్రభుత్వానికి ఎంత మొత్తం ఇస్తోందో జాతి మొత్తం తెలుసుకోవలసిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు మరియు భారత జాతికి తెలంగాణ పన్నుల రూపంలో భారత ప్రభుత్వానికి ఎంత మొత్తం సమర్పిస్తోందో దానికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం నుండి తెలంగాణకు తిరిగి ఎంత వస్తోందో తెలుసుకుని తీరాలి. ఈ విషయం తెలిస్తే కేంద్ర ఆర్థికమంత్రే నవ్వులపాలవుతారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత ఆరేళ్లలో అంటే 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో భారత ప్రభుత్వం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ. 2,72,926 కోట్లను వసూలు చేసుకుపోయిందని, కానీ తెలంగాణకు కేంద్రం తిరిగి ఇచ్చిన మొత్తం కేవలం రూ. 1,12,854 కోట్లు మాత్రమేనని, అంటే రెంటిమధ్య తేడా రూ. 1,60,072 కోట్లని కేటీఆర్ చెప్పారు. 2020-21 కేంద్రబడ్జెట్లో తెలంగాణకు నామమాత్రంగా 889 కోట్లను కేటాయించడం పట్ల కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు కేంద్రం నిధులను ఇవ్వడం లేదని విమర్శించారు. గత సంవత్సరం తెలంగాణకు రూ. 1,037 కోట్లను కేటాయించిన కేంద్రం ఈసారి మరింత తక్కువగా ముష్టి విదిలించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా