newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మృగాళ్ళ వికృతక్రీడ.. తెలంగాణలో ప్రియాంకా... తమిళనాడులో రోజా

30-11-201930-11-2019 14:39:57 IST
2019-11-30T09:09:57.400Z30-11-2019 2019-11-30T09:09:53.251Z - - 17-04-2021

మృగాళ్ళ వికృతక్రీడ.. తెలంగాణలో ప్రియాంకా... తమిళనాడులో రోజా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ దారుణ ఘటనను మరిచిపోకముందే తమిళనాడులో ఘోరం సంభవించింది. మృగాళ్ళు రెచ్చిపోయారు. కాంచీపురంలో రోజా అనే యువతి దారుణ హత్యకు గురైంది. యువతిని చిత్రహింసలు పెట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజూ ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా తమిళనాడులో యువతి హత్యకు గురైన ఉదంతం సభ్యసమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉంది. కాంచీపురానికి చెందిన ఇరవై ఏళ్ళ రోజా నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది.

గత శనివారం కనిపించకుండాపోయిన యువతి ఓ నిర్మానుష్య ప్రాంతంలో గురువారం చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు రోజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రోజా శరీరంపై కత్తిగాట్లు, గాయాలు కనిపించడంతో ఆమెను ఎవరో చిత్రహింసలు పెట్టి చంపేశారని అనుమానిస్తున్నారు. రోజాను చివరిసారిగా రాజేశ్‌ అనే యువకుడితో చూసినట్లు కొందరు చెబుతున్నారు.

దీంతో అతడే తన కూతురిని అత్యాచారం చేసి చంపేశాడని రోజా తండ్రి ఆరోపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

డాక్టర్ ప్రియాంకా రెడ్డితో పాటు, రోజా ఉదంతంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #JusticeforPriyankareddy ,  #JusticeForRoja హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. రోజాను దారుణంగా హతమార్చిన నిందితులును ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle