మూన్ మూన్ సేన్‌కి ఓటమి తప్పదా?
21-05-201921-05-2019 14:51:53 IST
Updated On 27-06-2019 12:48:57 ISTUpdated On 27-06-20192019-05-21T09:21:53.722Z21-05-2019 2019-05-21T09:21:51.721Z - 2019-06-27T07:18:57.650Z - 27-06-2019

రాజకీయాలకు గ్లామర్ జోడించాలని తాపత్రయపడిన ఆ తార ఈ ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని అసోన్ సోల్ పార్లమెంట్ సీటు నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు మూన్ మూన్ సేన్. 2014 ఎన్నికల్లో బెంగాల్‌లోని బంకురా ఎంపీ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు మూన్ మూన్ సేన్. బంకురా ఎంపీ సీటు నుంచి గతంలో తొమ్మిది సార్లు గెలిచిన సీపీఎం నేత వాసుదేవ్ ఆచార్యను ఆమె ఓడించారు. అయితే ఐదేళ్లలో ప్రజా సమస్యలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదట. అంతేకాదు, చాలాసార్లు పార్లమెంట్ సమావేశాలకు ఆమె గైర్హాజరు అయ్యారట. ఇక ప్రజలకు కూడా అందుబాటులో లేకపోవడంతో, ఈ ఎన్నికల్లో ఆమెను అసోన్ సోల్ సీటుకు మార్చారు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ. ఈ మార్పును ఊహించని మూన్ మూన్ సేన్, బంకురా సీటు పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. కానీ చివరి నిమిషంలో సీటు మరాడంతో ఆమె కంగుతిన్నారట. మమత బెనర్జీ మాటకు ఎదురు చెప్పలేక, అసోన్ సోల్ నుంచి బరిలో దిగారు. కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ బబూల్ సుప్రియో మీద ఆమె పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సుప్రియో, 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. స్థానిక సమస్యలు, పార్టీ కేడర్, ప్రజలకు అందుబాటులో ఉన్న సుప్రియో, పలుమార్లు మమత బెనర్జీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అంటే, ఏదో రకంగా జనం దృష్టి తన మీద ఉండేటట్లు చేసుకోవడంలో ఆయన విజయం సాధించారట. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో కూడా మూన్ మూన్ సేన్ వివాదాస్పద నిర్ణయాలు, కామెంట్లు చేశారు. బహిరంగ సభల్లో పాల్గొన్న ఆమె, ముస్లింల ఓట్ల కోసం, హిందువుల మీద నోరు జారారట. ఇక బబూల్ సుప్రియో కారు ధ్వంసం సంగతి తెల్సుకోకుండానే ఆమె వెటకారంగా ట్వీట్ చేసి జనం కోపానికి కారణం అయ్యారు. అంతేకాదు, కరపత్రాల్లో తన ఫొటోతో పాటు తన తల్లి ఫొటోను కూడా ముద్రించి ప్రచారం చేయడం వివాదాస్పదం అయింది. మరో విషయం ఏంటంటే, మూన్ మూన్ సేన్ అభ్యర్థిత్వం మీద కొందరు స్థానిక టీఎంసీ నేతలు గుర్రుగా ఉన్నారట. వీరంతా పరోక్షంగా సుప్రియోకు మద్దతు ఇచ్చారట. ఇక ఈ సీటులో గెలవడం కష్టమని భావించిన కాంగ్రెస్, సీపీఎంలు కూడా వీలైనంతగా బీజేపీ అభ్యర్థికి ఓట్లు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక ప్రత్యేక డార్జిలింగ్ కోసం పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా, గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీలు బహిరంగంగా బీజేపీకి మద్దతు పలికాయి. దీంతో బీజేపీ అభ్యర్థి బబూల్ సుప్రియో విజయం ఖాయమని తేలిందట.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా