newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడోసారి న‌రేంద్ర మోడీనే ప్ర‌ధాని..!

24-01-202024-01-2020 14:29:57 IST
Updated On 24-01-2020 15:05:30 ISTUpdated On 24-01-20202020-01-24T08:59:57.467Z24-01-2020 2020-01-24T08:59:49.667Z - 2020-01-24T09:35:30.552Z - 24-01-2020

మూడోసారి న‌రేంద్ర మోడీనే ప్ర‌ధాని..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీదే అధికారం అని అంటోంది తాజా స‌ర్వే. న‌రేంద్ర మోడీ మూడో సారి అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని, ఆయ‌నే దేశానికి స‌రైన నాయ‌కుడ‌నేది ప్ర‌జ‌ల భావ‌న‌గా స‌ర్వే తేల్చింది. క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, నిరుద్యోగ స‌మ‌స్య‌, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వంటి అంశాలు న‌రేంద్ర మోడీ ప్ర‌జాధ‌ర‌ణ‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేద‌ని తేలింది.

కార్వీ ఇన్‌సైట్స్ అనే సంస్థ‌తో క‌లిసి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ధి నేష‌న్ అనే స‌ర్వే నిర్వహించింది. దేశ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు ఏ విధంగా ఉన్నాయ‌నేది తులుసుకోవాల‌నే ఉద్దేశ్యంతో నిర్వ‌హించిన ఈ స‌ర్వే ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతోంది.

30 శాతం మంది న‌రేంద్ర మోడీ ప‌రిపాల‌న అద్భుతంగా ఉంద‌ని, 38 శాతం మంది బాగుంద‌ని, 19 శాతం మంది ప‌ర్వాలేద‌ని చెప్పారు. 9 శాతం మంది మాత్రం మోడీ పాల‌న బాగాలేద‌ని, 4 శాతం మంది అస్స‌లు బాగాలేద‌ని చెప్పారు.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 303 సీట్లు గెలుస్తుంద‌ని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 108 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంటుంద‌ని, ఇత‌రులు 132 సీట్లు గెలుస్తార‌ని ఈ స‌ర్వే అంచ‌నా వేసింది. అంటే న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాని అవుతార‌ని స‌ర్వే చెబుతోంది. కాగా, ఎన్‌డీఏ ఓట్ షేర్ నాలుగు శాతం త‌గ్గిపోయి 41 శాతం ఓట్లు సాధిస్తుంద‌ని, యూపీఏ ఓట్ షేర్ రెండు శాతం పెరిగి 29 శాతం సాధిస్తుంద‌ని, ఇత‌రులు 30 శాతం ఓట్లు సాధిస్తార‌ని స‌ర్వే తేల్చింది.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ విష‌యానికి వ‌స్తే 50 శాతం మంది న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వ ప‌నితీరు గ‌త యూపీఏ హ‌యాంలో ఆర్థిక వ్య‌వ‌స్థ కంటే బాగుంద‌ని చెప్పారు. 30 శాతం మంది ఎన్‌డీఏ కంటే యూపీఏ హ‌యాంలోనే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బాగుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

న‌రేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఉత్త‌మ మంత్రుల జాబితాలో హోమంత్రి అమిత్ షాకు మొద‌టి స్థానం ల‌భించింది. 43 శాతం మంది ఆయ‌నే బాగా ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. అమిత్ షా త‌ర్వాత స్థానంలో రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రి, నిర్మ‌లా సీతారామ‌ణ్‌, పియూష్ గోయ‌ల్ ఉన్నారు.

ఇక దేశంలో బాగా ప‌నిచేస్తున్న ముఖ్య‌మంత్రుల జాబితాలో ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆధిత్య‌నాథ్ మొద‌టి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ప‌శ్చిమ బెంగాల్ మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు.

మూడో స్థానంలో బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఐదో స్థానంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే నిలిచారు.

కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ఆ పార్టీని న‌డిపించ‌డం గాంధీ కుటుంబంతోనే సాధ్య‌మ‌నేది ప్ర‌జ‌ల అభిప్రాయ‌మ‌ని స‌ర్వే తేల్చింది. రాహుల్ గాంధీనే కాంగ్రెస్‌ను న‌డిపించ‌గ‌ల‌ర‌ని 24 శాతం మంది చెప్ప‌గా 14 శాతం మంది ప్రియాంక గాంధీ వైపు మొగ్గు చూపారు. వీరిద్ద‌రి త‌ర్వాత సోనియా గాంధీ, మ‌న్మోహ‌న్ సింగ్, రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌ కాంగ్రెస్‌ను న‌డ‌ప‌గ‌ల‌ర‌ని ఈ స‌ర్వేలో తేలింది.

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   15 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle